Renu Desai: రేణు తలచుకుంటే పవన్ కు జైలు శిక్ష.. ఏం జరిగిందంటే?

Renu Desai: పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకుల వివాదం గురించి మరొకసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి మాట్లాడిన వీడియోను రేణు దేశాయ్ ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియోలో కృష్ణ కుమారి మాట్లాడుతూ.. ” భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత అందరూ మహిళను తప్ప మగాడిని ఎవ్వరూ తప్పు పట్టటం లేదని ఇలాంటి పరిణామాలు చాలా దారుణం అన్నారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ విడాకుల విషయం గురించి మాట్లాడుతూ.. పవన్ విషయంలో రేణు పడిన కష్టాలు, చేసిన త్యాగాలను వివరంగా చెప్పింది. పవన్ తో రేణు దేశాయ్ సహజీవనం చేసి ఓ బిడ్డని కనేందుకు కూడా ముందుకొచ్చింద‌ని. అందుకోస‌మే కోర్టులో ఆ రోజు రేణు దేశాయ్ నా కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు.. పవన్ న‌న్ను పెళ్లి చేసుకున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే పవన్ కి జైలు శిక్ష పడేదని, కానీ ప‌వ‌న్ మ‌ర్యాద‌ను రేణు కాపాడింది అంటూ తెలిపింది.

రేణు దేశాయ్ ఈ వీడియో షేర్ చేస్తూ.. ఆమె ఎవ‌రో నాకు తెలియ‌దు కానీ మొద‌టిసారి నా త‌రుపున మాట్లాడ‌టం విని చాలా ఏచ్చాను. నేను ఏదైనా మాట్లాడితే రాజ‌కీయ పార్టీకి అమ్ముడుపోయానంటారు అని ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియో చూశాక నా బాధ అర్థం చేసుకునేవారు ఉన్నార‌నే ధైర్యం వ‌చ్చింది అంటూ రాసుకొచింది. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ విడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఆమెకు తన ఆస్తి మొత్తం రాసిచ్చాడని, అందువల్లే పవన్ మూడో పెళ్లి చేసుకున్నా కూడా రేణు అడ్డు చెప్పలేదని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

అంతే కాకుండా రేణు దేశాయ్ రెండవ పెళ్లి చేసుకోబోతోందని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను ఇబ్బంది పెడుతూ ట్రోల్ చేశారు. తాను పవన్ కళ్యాణ్ మాజీ భార్యని వేరే పెళ్లి ఎలా చేసుకుంటావో మేము చూస్తామంటూ తనని బెదిరించారని రేణు దేశాయ్ గతంలో ఎన్నోసార్లు చెప్పింది అయితే తాజాగా అకిరా పుట్టినరోజు సందర్భంగా మా అన్న కొడుకును చూపించండి అని నేటిజన్స్ అడగడంతో ఈమె మీ అన్న కొడుకు ఏంటి తను నా కొడుకు అంటూ నేటిజనులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -