Sajjala: ఆ టార్గెట్ ను సజ్జల సాధిస్తే మాత్రం ఏపీ ప్రజలకు మూడినట్లే?

Sajjala: ఆంధ్రప్రదేశ్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉండడంతోనే దొంగ ఓట్లను తొలగింపు ప్రక్రియ చేపడుతున్నామని తెలియజేశారు. దాదాపు 60 లక్షల వరకు దొంగ ఓట్లు ఉన్నాయని వీటిని తొలగించే ప్రక్రియ చేపట్టిన తరుణంలో వివాదంగా మారిందని తెలుస్తోంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టిలో దొంగ ఓట్లు అంటే వైసిపికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు అని విమర్శలు కూడా వస్తున్నాయి.

 

ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతోనే మొదలుపెట్టిందని తెలుస్తుంది. వాలంటీర్ల ద్వారా దొంగ ఓట్లను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టిందని సమాచారం.ఎవరైతే టిడిపికి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా ఉంటారో అలాంటి వారి ఓట్లను వాలంటీర్ల ద్వారా గుర్తించి వారి ఓట్లను గల్లంతయ్యేలా చేయటమే ప్రధాన వ్యూహంగా మారింది.

ఇలా రాష్ట్రంలో టిడిపికి అనుకూలంగా, వైసిపికి వ్యతిరేకంగా ఉండే ఓట్లను వెంటనే తొలగించాలని నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి అయితే గతంలో కూడా ఇలా దొంగ ఓట్లు అంటూ టిడిపికి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని టిడిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు దీంతో కేంద్ర ఎన్నికల సంఘం బరిలోకి దిగి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

 

ప్రస్తుతం ఇదే వ్యవహారం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ జరుగుతుందని,ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల దొంగ ఓట్లను అంటే టిడిపి ఓట్లను తొలగిస్తే తమ పార్టీకి అనుకూలంగా మారబోతుందని వైసీపీ పార్టీ నేతలు వ్యూహం రచిస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే పరిణామాలు దారుణంగా ఉండబోతున్నాయని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.మరి ఈ వ్యవహారం పై అయినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -