Flowers for Puja: పక్కింటోళ్ల పూలను ఉపయోగించి పూజలు చేస్తున్నారా.. అలా చేస్తే ఇలా జరుగుతుందా?

Flowers for Puja: మామూలుగా హిందువులు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా పువ్వులు ఉండాల్సిందే. పూలు లేకుండా పూజ చేస్తే కొంచెం అసంతృప్తిగా ఉంటుందని చెప్పవచ్చు. అందుకే పూజకు పువ్వులు వాడడం అన్నది తప్పనిసరి. సిటీలలో అయితే మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి బయట మార్కెట్లో దొరికే రకరకాల పువ్వులను తీసుకువచ్చి వాటితో పూజలు చేస్తూ ఉంటారు. కానీ పల్లెటూర్లలో అలా కాదు.

పక్కింటి ఎదురింట్లో పూలు కోసుకొచ్చి మరీ పూజలు చేసేస్తూ ఉంటారు. కొందరు పక్కింటి ఎదురింటి వాళ్లను అడిగి పూలు కోసుకుని పూజ చేస్తే మరికొందరు దొంగతనంగా పూలు కోసుకొని దేవుడికి అలంకరిస్తూ ఉంటారు. అయితే దేవుడికి పెట్టడానికి కదా అని చెప్పి పూలు మొత్తం కొసేయకూడదు. చెట్లో ఒక్క పువ్వు అయినా ఉంచాలి. అలా చేయకపోతే మహా పాపం అంటున్నారు పండితులు. అలాగే మీరు పక్కన ఎదురింటి వారి చెట్లలో పూలు కోస్తున్నప్పుడు వారిని అడిగి పూలు కోసుకోవడం అన్నది తప్పనిసరి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్ళిపోతుంది.

 

ఈ విషయాలు గరుడ పురాణంలో ఉంటాయి. పూలు కోసుకోవడం తప్పు కాదు కానీ ఆ ఇంటి యజమాని అడగకుండా కోసుకోవడం చాలా తప్పు. అలా కొయ్యకూడదు. పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కాబట్టి ఉపయోగించే పువ్వుల విషయంలో ఇటువంటి విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. ఇటువంటి విషయాలు పాటించకపోతే చేసిన ఫలితం దక్కకపోగా దేవుడి ఆగ్రహానికి లోనవ్వక తప్పదు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -