Bro Movie: ఆ సెంటిమెంట్ కలిసొస్తే బ్రో మూవీ సంచలనాలు సృష్టిస్తుందా?

Bro Movie: మామూలుగా చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ప్రేక్షకుల నుంచి డైరెక్టర్లు నిర్మాతలు బయ్యర్లకు ప్రతి ఒక్కరికి కూడా టికెట్లు రేట్లు గుర్తుకు వస్తాయి. పెద్ద మూవీస్ విడుదల అవుతున్నాయి అంటే నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు అంద‌రూ క‌లిసి ప్ర‌భుత్వాల ముందు విన్న‌పాలు చేసుకుంటూ రిక్వెస్టులు పెట్టుకుంటారు. తొలి మూడు రోజులో లేదా తొలి వారం రోజులో టిక్కెట్ రేట్లు పెంచుకుంటామ‌ని చెబుతూ ఉంటారు. ఏదోలా టిక్కెట్ రేట్లు పెంచుకుంటామ‌ని పించుకుంటారు. ఇది తెలుగులో పెద్ద హీరోలు, భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు కామ‌న్‌గా మారిపోయింది.

అయితే మ‌రో 9 రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ బ్రో సినిమాకు మాత్రం టిక్కెట్ రేట్లు పెంచ‌డం లేద‌ట‌. దీనిపై నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. తాము అనుకున్న బ‌డ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశాం. బిజినెస్ కూడా బాగా జ‌రిగింది. అందుకే తాము టిక్కెట్ రేట్లు పెంచే ఆలోచ‌న చేయ‌డం లేద‌ని చెప్పేశారు. ఏపీ, తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న రేట్ల‌తోనే బ్రో సినిమాను ప్ర‌ద‌ర్శిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఇక బ్రో సినిమా స్పెష‌ల్ ప్రీమియ‌ర్ల విష‌యంపై కూడా ఆయ‌న స్పందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్పెష‌ల్ ప్రీమియ‌ర్ల ఆలోచ‌న లేద‌ని చిన్న సినిమాల‌కు త‌మ కంటెంట్ చూపించుకునేందుకే ప్రీమియ‌ర్లు వేస్తుంటారు.

 

బ్రో సినిమాకు ఆ అవ‌స‌రం లేద‌నుకుంటున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇక పెద్ద సినిమాల్లో బాల‌య్య అఖండ సినిమాకు కూడా టిక్కెట్ రేట్లు పెంచ‌లేదు. ఆ సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో అంద‌రు హీరోల అభిమానులు అఖండ‌ను రెండు మూడు సార్లు చూసి మ‌రీ హిట్ చేశారు. ఇప్పుడు ఈ విష‌యంలో ప‌వ‌న్ బ్రో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న‌ట్టు ఉంది. ఇక బ్రో సినిమా ఈనెల 28న థియేటర్లలోకి విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -