Chandrababu: ఏపీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబే దిక్కా?

Chandrababu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా అప్పట్లో చంద్రబాబు 2020 విజన్ చెప్పారు. ఇది విన్న అందరూ ఎగతాలి చేయారు. ఈయన విజన్ ఏంటో ఈయన ఏంటో అనే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ చూసిన వాళ్లంతా, అప్పుడు చంద్రబాబు చెప్పింది నిజమైందని మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంటర్ననేషనల్ కంపెనీలన్నీ ఆయన చొరవతో వచ్చినవే.

 

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దార్శినికత కలిగిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే.ఐటీ, టెక్నాలజీ పరంగా ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది. ముందస్తు ఆలోచనలతో రాబోతే తరాలకు బాటలు వేస్తారు. ఎలాంటి సిటీలు నిర్మిస్తే కంపెనీలు వస్తాయనే విషయం బాగా తెలిసున్న వ్యక్తి చంద్రబాబు. ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ ను కూడా హైదరాబాద్ గా మార్చాలని భావించారు. ఇందుకోసం అమరావతిని ఎంచుకొని 33 వేల ఎకరాలు సేకరించారు. విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో కొన్ని కంపెనీలు కూడా తెచ్చారు. ప్రస్తుతం విశాఖలో ఉన్నవి రన్ అవుతున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలోచనని మార్చారు. ఉద్యోగ కల్పనకు పాతర వేశారు. దీంతో యువత పక్క రాష్ట్రాలకు వెళ్తోంది.

ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు రావాలని ఏపీ యువత కోరుకుంటోంది. హైదరాబాద్ కు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో కంపెనీలు వస్తుంటే మనకు మాత్రం ఏమీ రావటం లేదని ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ పథకాల వల్ల ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు. తమ భవిష్యత్తు బాగుపడాలంటే, చంద్రబాబు రావాలి జాబులు తేవాలని అని అంటున్నారు. చంద్రబాబుతోనే జాబులు సృష్టి సాధ్యమవుతోందని యువత నమ్మతోంది. చూద్దాం మరీ వచ్చే ఎన్నికల్లో బాబు గెలిచి జాబు తెస్తారేమో?

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -