Baireddipalle: సరదాగా అలాంటి పని చేసిన బాలికలు.. కట్ చేస్తే శవం?

Baireddipalle: సాధారణంగా సెలవులు వచ్చాయి అంటే చాలు కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా విహారయాత్రలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్లాలి అన్న కూడా భయపడాల్సిన పరిస్థితిలో నెలకొంటున్నాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఆలయాలకు వెళ్లినవారు, విహార యాత్రలకు వెళ్లిన వారు దురదృష్టవశాత్తు మరణిస్తున్నారు. తాజాగా కూడా అటువంటి చోటు చేసుకుంది. ముగ్గురు బాలికలు చేసిన చిన్న పొరపాటు వల్ల ముగ్గురు కూడా మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. అసలేం జరిగిందంటే..

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం, దేవదొడ్డి గ్రామానికి చెందిన కదిరప్ప అనే వ్యక్తి కూలిపనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో ఆయన కోరుకున్న కోరికలు తీరడంతో గ్రామ సమీపంలోని కాటేరమ్మకు దేవర చేయాలని అనుకున్నాడు. అమ్మవారికి తాను చేస్తున్న దేవరకు తమిళనాడు రాష్ట్రంలోని అరవట్లలో ఉండే తన బంధువులను ఆహ్వానించాడు. కదిరప్ప బంధువులు కూడా ఎంతో సంతోషంగా దేవరకోసం కదిరప్ప ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి మంగళవారం అందరూ కలిసి కాళభైరేశ్వరస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.

 

అక్కడ అందరు కలిసి అమ్మవారికి పూజలు చేస్తుండగా ఆయా కుటుంబాలకు చెందిన ముగ్గురు బాలికలు కొండ కింద కోనేటి వద్ద సరదగా గడిపేందుకు వెళ్లారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో కోనేట్లో దిగి స్నానాలు చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో కదిరప్ప కుమార్తె గౌతమి అనే 14 ఏళ్ళ బాలిక, అరవట్లకు చెందిన సుబ్రమణ్యం కుమార్తె భవ్య అనే 17 ఏళ్ల బాలిక అలాగే రమణ కుమార్తె మౌనిక అనే 13 ఏళ్ల బాలిక ముగ్గురు కలిసి ఒకరి వెంట ఒకరు నీటిలోకి దిగారు.

 

అక్కడి నుంచి నీటిలో పడిపోయి మృత్యు ఒడికి చేరారు. ఎన్నో ఏళ్లుగా కోనేటి కింది భాగంలో పాచి పట్టి అది కాళ్లకు తగులుకుని బిడ్డలను పైకి రాకుండా చేసిందని స్థానికులు అంటున్నారు.
కోనేటి వద్ద ఆలయ నిర్వాహకులు పర్యవేక్షణ లేకపోవడం, ఈ ఆలయం అడవిలో ఉండడంతో వారు ప్రాణాలను ఎవరూ కాపాడలేకపోయారని స్థానికులు అంటున్నారు. అయితే చేతికి అందివచ్చిన బిడ్డలు దూరమవ్వడంతో మృతుల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు గుండెలు విలసేలా రోదించారు. వారి ఆవేదన అందర్నీ కండతడి పెట్టించింది. సరదాగా ఈత కొట్టాలి అనుకున్నా ఆ ముగ్గురు బాలికల సరదానే వారి ప్రాణం తీసింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -