TDP-YCP: ఎన్డీఏలో టీడీపీ చేరితే మాత్రం వైసీపీకే ఇబ్బందే.. జన్మలో అధికారం రాదా?

TDP-YCP: తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందన్నట్టు తయారైంది ఏపీ సీఎం జగన్ పరిస్తితి. బీజేపీతో టీడీపీ పొత్తు కుదరకుండా చేయాలని శతవిధాల ప్రయత్నించినా ఆయన విఫలమయ్యారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. నడ్డా, అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు విడివిడిగా సమావేశమైయ్యారు. ఏపీలోని రాజకీయ పరిస్థితులపై అమిత్ షాతో చర్చించారు. దీంతో పాటు.. ఎన్డీఏలో టీడీపీ చేరికపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. కానీ, అమిత్ షాతో సీట్ల పంపకాలపై మాత్రం మాట్లాడలేదని సమాచారం.

 

జేపీ నడ్డాతో సీట్లు కేటాయింపుపై చర్చించారని ఢిల్లీవర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సీట్లు విషయంలో కాస్తా పట్టువిడుపు దోరణిలో ఉన్నా.. లోక్‌సభ సీట్లు మాత్రం ఎక్కువగా కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, చంద్రబాబు మాత్రం ఈ విషయంలో తన వెర్సన్ వినిపించినట్టు తెలుస్తోంది. బలం లేని చోటు బీజేపీకి సీటు కేటాయిస్తే.. అది వైసీపీకి లాభం చేసినట్టు అవుతుందని ఆయన నడ్డాతో చెప్పారట. బీజేపీ, జనసేనకు కలిపి ఆరు పార్లమెంట్ స్థానాలు, 30 వరకు అసెంబ్లీ స్థానాలు ఇస్తానని చంద్రబాబు చెప్పారట. దీనికి సంబందించిన పూర్తి వివరాలు కూడా జేపీ నడ్డాకు ఇచ్చి చంద్రబాబు హైద్రాబాద్ వచ్చేశారు.

చంద్రబాబు వచ్చిన తర్వాత పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన అమిత్ షాతో భేటీ కానున్నారు. అమిత్ షా మూడు పార్టీల పొత్తుపై పవన్ కు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఎన్డీఏలో జనసేన భాగస్వామియే అని పవన్ చెబుతూ వచ్చారు. ఎలాగైనా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ పట్టుపట్టి కూర్చున్నారు. మొత్తానికి పవన్ శ్రమకు ఫలితం దక్కనటైంది. పవన్ హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 

ఇక ఎన్డీఏలో టీడీపీ చేరిక వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి. పార్లమెంట్‌లో అన్ని బిల్లులకు బీజేపీకి సపోర్టు చేస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు ఒంటిరిగా మిగిలిపోయింది. బీజేపీతో ప్రత్యేక్షంగా వైసీపీకి పొత్తు లేకపోయినా.. ఎన్నికల సమయంలో కేంద్రం నుంచి సహకారం ఉంటుందని జగన్ భావించారు. కానీ, అనుకున్నదొకటి అయినది ఒకటి అయింది.

 

అసలు టీడీపీ, జనసేన పొత్తు కుదరకుండానే చాలా ప్రయత్నాలు చేశారు జగన్. జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే వైసీపీ నేతలు చేయాల్సిందంతా చేశారు. కానీ, పవన్ వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో జనసేన, టీడీపీ బంధం బలపడింది. అక్కడ ఫెయిల్ అయిన జగన్.. కనీసం టీడీపీని ఎన్డీఏలో చేరకుండా ఆపేందుకు ప్రయత్నించారు. కానీ, అది కూడా వర్క్ అవుట్ కాలేదు.

 

అయితే.. జగన్ సడెన్‌గా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏలో టీడీపీ చేరికను అడ్డుకోవడానికే జగన్ ఢిల్లీ వెళ్లారని చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో కేంద్రానికి అన్ని రకాలుగా అండగా ఉన్నామనే విషయాన్ని బీజేపీ పెద్దలకు గుర్తు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖాయంగానే తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -