Nellore: ఆ కారణంతో ప్రియుడి పారిపోయాడు.. ఆ తర్వాతి రోజు పెళ్లి!

Nellore: ప్రేమ పేరుతో మోసాలకు దిగడం ఇటీవల చాలా పెరిగిపోయాయి. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారికి వివిధ రకాలుగా వాడుకుని ఆ తర్వాత జంప్‌ అవుతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కొందరు ఆత్మహత్యకు పాల్పడి నిండు జీవితాలను చిదిమేసుకుంటున్నారు. కొందరు యువతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ముందు ధర్నాలకు దిగడం మాములైంది. తాజాగా జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. మొదట ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి అనే సరికి యువకుడు పారిపోతున్న ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామానికి చెందిన గుత్తికొండ హరి నారాయణ, చేజర్ల మండలం ఏటూరు గ్రామానికి చెందిన పోలిపోగు మాధవి ఏడేళ్లుగా ప్రేమించుకున్నామని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ మాధవి ఆరోపిస్తోంది. చివరకు చేసేదేం లేక అల్దుర్తికి వచ్చిన మాధవి ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టింది. ఇంటి వద్దకు వచ్చిన మాధవిని హరినారాయణ కుటుంబ సభ్యులు గేటువద్దే అడ్డుకున్నారు. హరినారాయణ ఇంట్లో ఉన్నా లేడని చెప్పారు. మాధవితో మాట్లాడతానని చెప్పిన హరినారాయణ తల్లి ఆమెను ఇంటినుంచి దూరంగా తీసుకెళ్లింది. ఈలోగా హరినారాయణ వెనకవైపు ఉన్న గోడ దూకి పారిపోయాడు. దీంతో మాధవి వారి ఇంటిముందే బైఠాయించి న్యాయం చేయాలని కోరింది. ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుని హరినారాయణతో తాళి కట్టించుకుంది

సీన్ కట్ చేస్తే ఆ తర్వాతి అబ్బాయి, అమ్మాయి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అమ్మాయికి స్వీట్ పెట్టమంటే మొహమాటం కోసం పెడుతున్నారు. అమ్మాయి పక్కన సంతోషంగా నిలబడటానికి కూడా ఇష్టపడటం లేదు కానీ మహిళా సంఘాల నేతలు మాత్రం అబ్బాయి తగ్గాల్సిందే అంటున్నారు. అమ్మాయిని బాగా చూసుకోవాలని చెప్పారు. ఏమాత్రం తేడా వచ్చినా తాము ఎంట్రీ ఇవ్వడానికి సంకోచించబోమని హెచ్చరించారు.

తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు చెబుతోంది మాధవి ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత తనను వదిలించుకోవాలని చూశారని, కులం పేరుతో తనను దూరం పెట్టారని అంటోంది. తన వద్ద నగదు కూడా తీసుకున్నారని, తన పేరు మీద లోన్ తీసుకుని ఇంటికి ఫర్నిచర్ కూడా తీసుకున్నారని ఆరోపిస్తోంది. అయితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. చివరకు దిశ పోలీస్ స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేయడంతో ఆమెకు కొంతమంది. మహిళా నేతలు అండగా నిలవడంతో ఎట్టకేలకు పెళ్లి అయిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -