Nellore YCP: నెల్లూరులో వైసీపీ చరిత్ర ముగిసినట్టేనా.. కంచుకోటలో పరిస్థితి ఇంత దారుణమా?

Nellore YCP: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో అందరి చూపు నెల్లూరు జిల్లాపైనే పడింది. ఎందుకంటే అధికార వైసీపీపై వ్యతిరేకత బహిర్గతం అవ్వడం ఆ జిల్లా నుంచే ప్రారంభమైంది. నిజానికి నెల్లూరు జిల్లా వైసీపీకి పెట్టని కోట. వైసీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ అక్కడ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ అంతా వైసీపీలో చేరడంతో అక్కడ జగన్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఎన్నికల్లో కూడా నెల్లూరులో వైసీపీ 7 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం అయింది. అంటే.. అధికారంలోకి వచ్చినపుడు కూడా టీడీపీకి నెల్లూరు జిల్లా అనుకూలంగా లేదు. ఇక, 2019 ఎన్నికల్లో టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. పదికి పది స్థానాలు కూడా వైసీపీ కొల్లగొట్టింది.

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ పెట్టని కోటని టీడీపీ ఆక్రమించిందనే చెప్పాలి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం వరకూ అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా ఆతర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు అధిష్టానంపై అసమ్మతి స్వరం వినిపించారు. అక్కడ మొదలైన వైసీపీ పతనం చివరికి నెల్లూరులో కనీసం ఖాతా అయినా తెరుస్తామా? అనే స్థాయికి ఎదిగింది. ఏడాదిన్న క్రితం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీపై తిరుగుబాటు చేశారు. వారిచ్చిన దైర్యంతో పార్టీలో చాలా మంది వారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాతే ప్రజలు కూడా వారి అసమ్మతిని దైర్యంగా బయటకు చెప్పగలిగారు. ఆ తర్వాత వీరంతా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మరోవైపు ఇంతకాలం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ వైఖరితో విభేదిస్తూ తెలుగుదేశం గూటికి చేరిపోయారు. వారితో పాటు క్యాడర్ ను కూడా టీడీపీలో కలుపుకున్నారు.

దీంతో.. నెల్లూరు జిల్లా వైసీపీలో చెప్పుకునేవారెవరూ లేరు. ఇంకా అక్కడ మిగిలిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా నరసారావు పేట ఎంపీగా గుంటూరు జిల్లాకు పంపించేశారు. నెల్లూరు జిల్లా ఖాళీ కావడంతో విశాఖపట్నం నుంచి విజయసాయిరెడ్డిని ఆ జిల్లాకు జగన్ పంపించారు. విజయసాయిరెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయన జిల్లాలో పరిస్థితులను చక్కదిద్దుతారని అనుకుకున్నారు. అందుకే ఆయన్ని నెల్లూరు పార్లమెంట్ కు పోటీ చేయిస్తున్నారు. కానీ, ఎప్పుడో పరిస్థితులు అక్కడ చేయి దాటిపోయాయి. కాబట్టి విజయసాయిరెడ్డి వచ్చి చేసేది ఏమీలేదు.

ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు జిల్లాలో 8 స్థానాలు టీడీపీ గెలుచుకుంటుంది. మరో రెండు స్థానాల్లో పోటీ హోరాహోరీగా ఉంటుంది. ఇటీవల బయటకు వచ్చిన కొన్ని సర్వేల్లో 6 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. మరో రెండు స్థానాల్లో టీడీపీ ఎడ్జ్ లో ఉందని తెలిపాయి. సూళ్లూరుపేట మాత్రం వైసీపీ ఖాతాలో ఖాయంగా పుడుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక, సర్వేపల్లిలో ఇప్పుడే గెలుపును అంచనా వేయలేమని అంటున్నారు. ఇక నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి ఓటమి కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ప్రచారంలోనే పరిస్థితి అర్థం అవుతుంది. ప్రజలు ఎవరూ ఆయన ప్రసంగాన్ని వినడానికి ఇష్టపడటం లేదు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Volunteers on YSRCP Manifesto: గ్రామ వాలంటీర్ల మైండ్ బ్లాంక్ చేసిన మేనిఫెస్టో.. నిన్ను నమ్మం జగన్ అంటూ?

Volunteers on YSRCP Manifesto: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి సాధారణ ప్రజలే కాదు ఆయన కోసమే పని చేసిన గ్రామ వాలంటీర్లు కూడా జగన్ అన్యాయం చేశాడని గగ్గోలు పెడుతున్నారు సదరు గ్రామ వాలంటీర్లు. గత...
- Advertisement -
- Advertisement -