Narayana: నెల్లూరులో వైసీపీకి గడ్డుకాలమేనా.. నారాయణ ప్రజల మెప్పు పొందారా?

Narayana: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ రాజకీయం ఒక ఎత్తైతే.. నెల్లూరు రాజకీయం మరో ఎత్తులా మారింది. ఎందుకంటే నెల్లూరు నుంచే అధికార వైసీపీపై తిరుగుబాటు మొదలైంది. దీంతో… నెల్లూరు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. దీంతో.. అందరి ఫోకస్ నెల్లూరు సిటీపైనే ఉంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే, టీడీపీ హయాంలో ఆయన మంత్రిగా ఉంటూ పెద్ద ఎత్తున అభివృద్ది చేశారు. కానీ, ఆయన ఓడిపోవడం ఏపీలో చర్చకు దారి తీసింది. ఆయనపై వైసీపీ తరుఫున పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు. అయితే, ఈసారి టీడీపీ నుంచి మరోసారి నారాయణ పోటీ చేస్తున్నారు కానీ, వైసీపీ తరుఫున మాత్రం అనిల్ బరిలో లేరు. అనిల్‌ను వైసీపీ అధిష్టానం నర్సారావు పేట ఎంపీగా బరి దించుతుంది. కానీ, అనిల్ మాత్రం తన అనుచరుడినే నెల్లూరు సిటీ బరిలో ఉండేలా జాగ్రత్తపడ్డారు.

 

 

ఇప్పుడు నెల్లూరు సిటీలో వైసీపీ, టీడీపీ బలాబలాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇక్కడ టీడీపీ నారాయణ గెలుపు ఖాయంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో నారాయణ కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. నారాయణకు 46శాతం ఓట్లు పడగా… అనిల్ కుమార్ యాదవ్‌కు 47 ఓట్లు పడ్డాయి. పైగా గత ఎన్నికల్లో జనసేనకు 3 శాతం ఓట్లు పడ్డాయి. అయితే, ఇప్పుడు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో.. 50శాతానికిపైగా ఓట్లు టీడీపీ ఖాతాలో పడతాయని నారాయణ అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు.. ఒక్కశాతం మెజార్టీతో కూడా వైసీపీ గెలవడానికి తీవ్రంగా శ్రమించింది. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపునకు ప్రధాన కారణం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. వీరిద్దరూ ఇప్పుడు టీడీపీలో చేరారు. దీంతో, నెల్లూరులో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు.

అటు, గత ఎన్నికల్లో నారాయణ ఓటమి ఆయనపై సింపతీని పెంచిందనే టాక్ కూడా ఉంది. రాష్ట్రాంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో స్థానికంగా అభివృద్ధి చేశారు. కానీ, జగన్ గాలితో పాటు.. జనసేన విడిగా పోటీ చేయడం టీడీపీ ఓటమికి కారణమైంది. ఆ తర్వాత టీడీపీ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క వార్డు కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. కానీ, ఆతర్వాత పరిస్థితులు మారాయి. వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు నెల్లూరు నుంచే మొదలైంది. అప్పటి నుంచి టీడీపీ బలం పుంజుకుంది. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగాయి. కాబట్టి నెల్లూరు సిటీలో టీడీపీ గెలుపు ఖాయంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -