Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే వీరీతో గొడ్డు చాకిరి చేయించుకుంటూ గౌరవ వేతనం అంటూ కేవలం 5000 రూపాయలను మాత్రమే వీరి చేతికి ఇస్తున్నారు 5000 తో కుటుంబాన్ని పోషించడం కూడా వాలంటీర్లకు కష్టతరంగానే ఉందని చెప్పాలి.

ఇలా ఎన్నో సందర్భాలలో వాలంటీర్లు తమ గౌరవ వేతనం పెంచాలని చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారని అది కేవలం గౌరవ వేతనం మాత్రమే తప్ప సాలరీ కాదని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని తెలిపారు.

ఇలా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడమే కాకుండా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఏకంగా 10,000 రూపాయల జీతం ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీంతో వీరందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఈ క్రమంలోనే నెల్లూరులో ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో 40 మంది వాలంటీర్లు టిడిపి పార్టీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే నారాయణ సమక్షంలో మరో వంద మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇలా స్వచ్ఛందంగా వాలంటీర్లు సైతం తెలుగుదేశం పార్టీలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి షాక్ లో ఉన్నారని చెప్పాలి

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -