Pawan Kalyan: కాలజ్ఞానం నిజమైతే పవన్ కళ్యాణ్ సీఎం అయినట్టే!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. అన్ని పార్టీలు రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలను ఇప్పటి నుండే మొదలుపెట్టాయి. ఈసారి ఎన్నికల కోసం జెట్ స్పీడుతో దూసుకెళుతున్న పార్టీ జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఈ పార్టీ ఎన్నికలే టార్గెట్ గా ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా.. మిగిలిన పార్టీలు పవన్ కు కౌంటర్లు వేస్తున్నాయి.

 

ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతుందనే ప్రచారం ఊపందుకోగా.. జనసేన కార్యకర్తలు కాలజ్ఞానానికి సంబంధించిన కొన్ని వాక్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలో పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని, అధికారం చేపట్టబోతున్నట్లు పేర్కొన్నట్లు జనసైనికులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వాక్యాలను కూడా వాళ్లు ప్రస్తావిస్తున్నారు.

 

“ధరణిలో సిద్ధార్థి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చెనయ్య!
రాజవారసత్వము నశించినయ!
ప్రజారాజ్యము విలసిల్లునయా!
తప్పదు నా మాట నమ్మండయా!!”

అని బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో చెప్పారని జనసైనికులు అంటున్నారు. అంటే సమీప భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడని వాళ్లు గట్టిగా విశ్వసిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం సిద్ధార్థి నామ సంవత్సరం గతంలో 1919, 1979లో రాగా.. భవిష్యత్తులో 2029 రాబోతోంది. దీంతో 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని గట్టిగా ప్రచారం చేస్తున్నారు.

 

అయితే పవన్ కళ్యాణ్ గురించి నిజంగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారా? లేదంటే జనసైనికులు ఉత్సాహంతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గతంలో ‘చంద్రగ్రహనం వేడేను’ అంటూ చంద్రబాబు నాయుడు అధికారానికి దూరమవుతాడని, అలాగే కరోనా గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారనే వార్తలు వైరల్ కావడం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -