Pawan Kalyan: 2023లో వీరమల్లు లేనట్టే.. పవన్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇదే!

Pawan Kalyan: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నాడు పవన్. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమాలలో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమా ఏ ముహుర్తాన తను మొదలుపెట్టారు కానీ ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు.

 

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమ్మర్లో పవన్ కళ్యాణ్ చేయ్యరట. కావాలి అంటే ఏప్రిల్ లో ఒక పది రోజులు చేస్తానని తెలిపినట్టుగా తెలుస్తోంది. పీకాకుండా సమ్మర్ ముగిసే వరకు హరిహర వీరమల్లు సినిమా జోలికి పవన్ వెళ్లనట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం పవన్ మూడు సినిమాలకు డేట్ ల అడ్జస్ట్ చేస్తూ హరి హర వీరమల్లు సినిమా విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, ఆ పాత్రకు వాడుతున్న దుస్తులు, మేకప్ ఇతరత్రా వ్యవహారాలేనని తెలుస్తోంది.

వేసవి వేడిలో అంత హెవీ దుస్తులు, హెవీ మేకప్, ఇతరత్రా ప్రాపర్టీస్ వాడడం కష్టం అని పవన్ అలోచించినట్లు తెలుస్తోంది. కావాలంటే ఏప్రిల్ లో ఓ వారం పది రోజులు ట్రయ్ చేస్తా అని, మే, జూన్ మాత్రం సమస్య లేదని దర్శకుడు క్రిష్ కు పవన్ క్లారిటీ ఇచ్చిన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా జూలై తరువాత కానీ హరి హర వీరమల్లు షూట్ ఫైనల్ గా మొదలు పెట్టకపోతే ఈ ఏడాది విడుదల కష్టమే కావచ్చు. ఇటీవలే ఈ హరిహర వీర మల్లు సినిమా షూటింగ్లో పవన్ పట్టుమని పది రోజులు కూడా షూటింగ్ జరగక ముందే మళ్లీ హరిహర వీరమల్లకి గుడ్ బాయ్ చెప్పేది తదుపరి సినిమా షూటింగ్లో బిజీ బిజీ అయ్యారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పై చూపిస్తున్న ఇంట్రెస్ట్ ని బట్టి చూస్తుంటే 2023లో హరిహర వీరమల్లు సినిమా విడుదల అయ్యేటట్టు కనిపించడం లేదు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -