ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇవి పెడితే మీ లక్కేలక్కు!

తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇల్లు నిర్మాణం చేయాలన్నా.. కొత్త ఇల్లు కొనాలన్నా వాస్తు ప్రకారం ఉందా లేదా అని చూసుకుంటారు. వాస్తు బాగుంటే ధర ఎక్కువగా ఉన్నా అలాంటి ఇల్లు కొనడానికి వెనకాడరు. అతి తక్కువ ధరకే ఇల్లు విక్రయిస్తున్నా ఆ ఇంటికి సరైన వాస్తు లేకపోతే అస్సలు కొనరు. ఇల్లు కట్టిన తర్వాత కూడా పలాన వస్తువు అక్కడ ఉండాలి.. పలాన గది అటువైపు ఉండాలని భావిస్తుంటారు. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ప్రధాన ద్వారం ఉంచడంతో శుభప్రదంగా ఉంటుందని భావించి వాటినే అక్కడే ఉంచుతారు.

ఇంటి తోరణం: ఇంటికి ఎన్ని ద్వారాలున్నా ప్రధాన ద్వారానికే తోరణం పెడితే మంచి జరుగుతోందని భావిస్తారు. మామిడి, రావి ఆకులతో తోరణం తయారు చేసి ప్రధాన ద్వారానికి కట్టాలి. అవి ఎండిపోతే వాటిని తొలగించి కొత్త ఆకులతో తయారు చేసి కట్టుకోవాలి.

లక్ష్మిదేవి పాదాలు: దీపావళి పూజల సమయంలో ఇంట్లో లక్ష్మిదేవి పాదాలను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్యిదేవి పాదాల గుర్తులను వేసుకోవచ్చు. ఇలా చేస్తే ఇంట్లో సిరి సంపదాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది.

శుభం గుర్తు: ఇంటి ప్రదాన గుమ్మానికి ఇరువైపులా శుభం గుర్తు వేసుకుంటారు. ఈ గుర్తులు ప్రతికూలత, చెడు, దుష్ట శక్తుల నుంచి కాపాడుతోందని నమమ్మకంతో వీటిని గొడలపై వేస్తారు.

స్వస్తిక్‌ గుర్తు: హిందువుల్లో ప్రతి శుభకార్యం ప్రారంభించే ముందు కుంకుమ, గంధం ఉపయోగించి స్వస్తిక్‌ గుర్తును వేస్తారు. ఈ గుర్తు అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్‌ గుర్తు వేయడంతో ఇంటి సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి వాస్తు దోశాలున్నా తొలగిపోతాయనే నమ్మకంతో ప్రతి ఇంటికి çస్వస్తిక్‌ గుర్తులు వేసుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -