Snakes: వాటికోసమే పాములు ఇళ్లల్లోకి దూసుకొస్తాయి!

Snakes: పాములంటే అందరికీ భయమే. వాటిని చూస్తేనే ఎంతటి ధైర్యవంతుడు కూడా పరుగు తీయడం ఖాయం. అంత విషపూరితమైన పాములను దేవతలుగా భావించి పూజలు చేస్తారు. సాధారణంగా పాములు అడవులు, పొలాల్లో ఉంటాయి. అప్పుడప్పుడు ఇళ్లలోకి చొరబడటం చేస్తుంటాయి. అయితే పాములు ఇళ్లల్లోకి వచ్చేందకు ఆరు కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని విడితే ప్రక్రియ కేవలం పాముల్లోనే ఉంటుంది. పాములు సీజన్‌ ప్రకారం పాత చర్మాన్ని వదిలేస్తుంటాయి.

అయితే అవి చర్మాన్ని వదిలేటప్పుడు వాటికి ఒక సపోర్టు అవసరం పడుతోంది. ఆ సపోర్టు కోసం రాళ్లు, కాంక్రీటు, కలపచ, చెట్లు వంటి వాటికోసం వెతుకుతుంటాయి. అలా వాటిని వెతుక్కుంటూ నివాస గృహాల వైపుకు వస్తోంటాయి. పాములకు ఆహారం లభించకపోవడంతో కూడా ఇళ్లలోకి వస్తుంటాయి. పర్యావరణ చట్రంలో పాములు కూడా భాగమే. పంటపొలాల్లో తెగుళ్లను తినేది పాములే. సరిసృపాల ఆహారం కోసం కూడా ఇళ్లవైపుకు వస్తుంటాయి. ఇళ్లలో ఉండే ఎలుకలు, బయట ఉండే కప్పలు, బల్లులు, పక్షుల కోసం వస్తుంటాయి.

పాములు కోల్డ్‌ బ్లడెట్‌ జీవులు కావడంతో వెచ్చదనం కోసం చూస్తుంటాయి. శరీర ఉష్ణోగ్రతను తట్టుకోలేక వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి ఇళ్లలోకి ఎలాగైనా చొరబడగలవు. తలుపులు, కిటికీలు, గోడల బీటలు, చిన్న చిన్న రంధ్రాల్లోంచి పాములు చొచ్చుకు వచ్చేస్తాయి. పాములు చిన్న సందు దొరికినా చేరిపోతుంటాయి. ఇంటి ప్రదేశాల్ని ఎవరూ గుర్తించలేరన్నట్టుగా భావించి ఇళ్లలో మూలల్లో చేరిపోతుంటాయి. సీజన్‌ మారినప్పడు పాములు నిద్రాణ స్థితిలో చేరుతుంటాయి.ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కాస్త నిర్మాణుష్యంగా, పొదలు, చెట్లు ఉండే ప్రదేశాల్లో, ఇరుకుగా ఉండే గుడిసెల్లో పాములు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -