LPG Cylinder: భారీగా తగ్గిన సిలిండర్‌ రేటు.. ఎంతంటే?

LPG Cylinder: రోజు రోజుకు పెరుగుతున్న వివిధ ధరల కారణంగా సమాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఏ ధర పెరిగినా అంతాగా ప్రభావం చూపకున్నా ఇంధన ధరలు మాత్రం పెరిగితే సామాన్యులు కొట్టుమిట్టులాడుతుంటారు. గతేడాది నుంచి పెరుగుతున్న సిలిండర్‌ ధరలతో జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలో కొన్ని చమురు కంపెనీల నిర్ణయంతో సెప్టెంబర్‌ ప్రారంభం నుంచే సిలిండర్‌ వినియోగదారులకు భారీ ఊరట కలిగించి శుభవార్త చెప్పాయి. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నాయి.

19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.91.5 లకు తగ్గించాయి. గ్యాస్‌ కంపెనీల నిర్ణయంతో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1885, ముంబయిలో రూ.1884, హైదరాబాద్‌లో రూ.2099.5కు చేరాయి. తగ్గించిన ధరలు నేటి(గురువారం) నుంచే అమలులోకి వస్తాయని ఆయా చమురు సంస్థలు పేర్కొన్నాయి. మే నెల 19వ తేదీ నుంచి వాణిజ్య సిలిండర్‌ ధర 5 సారి తగ్గినా డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర మాత్రం తటస్థంగా ఉంది.

ఇటీవల జరిగిన రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అప్పటి నుంచి ముడి చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ సిలిండర్ల ధరలు ఇప్పటికే పలుసార్లు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ముడి చమురు ధర కిందికి దిగిరావడంతో దానితో ముడిపడ్డి ఉన్న ఉత్పత్తుల ధర కూడా తగ్గుముఖం పట్టింది. తాజాగా గ్యాస్‌ కంపెనీలు తగ్గించిన ధరల ప్రభావం టిఫిన్‌ సెంటర్లు, రెస్టారెంట్ల ఉండనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -