Stars: ఈ స్టార్స్ ఇతర వ్యాపారాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Stars: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు అంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ కోవ కిందకు టాలీవుడ్ స్టార్స్ వ్యాపారాలు సరిపోతున్నాయి. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ మధ్య పెద్ద పెద్ద స్టార్లు వ్యాపారాల వైపు తొంగి చూస్తున్నారు. ఆ మధ్య కరోనా వల్ల సినిమాలన్నీ ఆగిపోయాయి. అటువంటి సమయంలో కొందరు ఆదాయం లేక అల్లాడిపోయారు. అందుకే ఇకపై అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు సినిమాలు చేస్తూనే వ్యాపారాల్లో సైతం రాణిస్తున్నారు.

 

టాలీవుడ్ లో బడా స్టార్లు ఓ వైపు పాన్ ఇండియా లెవల్లో సినిమా చేస్తూనే మరో వైపు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకొందరు అయితే వాణిజ్య ప్రకటనలు చేస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. మరి అలా డబ్బులు సంపాదిస్తున్న వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప2 చేస్తున్నారు. వ్యాపార విషయాలకు వస్తే ఈ హీరో హైదరాబాద్ లో బఫెలో వింగ్స్ ఫ్రాంచైజీ అనే బార్ ను, అలాగే 800 జూబ్లీహిల్స్ పేరుతో ఒక పబ్ ను నడిపిస్తున్నారు. బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా ఒక ఫోటో స్టూడియోను నెలకొల్పింది.

 

సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే సంవత్సరంలో ఒక సినిమా అయినా థియేటర్లలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ యాడ్స్ రూపంలో మహేష్ బాబుకు భారీగానే ఆదాయం అందుతోంది. ఆయన భార్య నమ్రత కూడా రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించి విజయవంతంగా రాణిస్తున్నారు.

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్ ను స్థాపించారు. అలాగే విమాన రంగంలో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారు. ఆయన భార్య ఉపాసన కూడా అపోలో గ్రూప్స్ లో వాటాదారురాలిగా కొనసాగుతున్నారు.

 

అలాగే బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన హీరో ప్రభాస్ తన సొంత థియేటర్లను ప్రారంభించారు. మల్లీప్లెక్స్ థియేటర్ వ్యాపారం చేస్తున్నారు. అలాగే పలు యాడ్స్ లోనూ నటిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -