Telugu states: ఈ ముగ్గురు కలిస్తే తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు గ్యారంటీ?

Telugu states: తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పాలకపక్షాలు పన్నే వ్యూహాల్లో చిక్కుకొని విలపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి ఆ పార్టీని బయటకు తీసుకురావాలంటే, నందమూరి, నారా కుటుంబాలు ఒక్కతాటిపైకి రావాలని తెలుగు తమ్మళ్లు ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ ఆ రెండు కుటుంబాలు వివిధ కారణాలతో ఇప్పటికీ రాలేకపోతున్నాయి. కానీ తాజాగా తెలిసిన విషయం ప్రకారం చూస్తే పక్కగా కలిసి వచ్చే ఎన్నికలకు పని చేస్తారని అర్ధమవుతోంది.

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మారుమూల పల్లెల్లోనూ ఇప్పటికీ నందమూరి తారకరామారావుని తలుచుకుంటారు. ఆయన పెట్టిన పథకాలు అప్పటి పరిస్థితులకు ఆ విధంగా సూట్ అయ్యాయి. రేషన్ దుకాణాల ద్వారా రూపాయికి కిలో బియ్యం ఇచ్చిన టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఆ పార్టీ పగ్గాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు సైతం, పార్టీని సమర్ధవంతంగా నడిపించారు. కానీ ఉమ్మడి రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. 2014లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయినా, ఆంధ్రలో వచ్చింది. అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓటమి పాలైంది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తెలంగాణలో క్యాడర్ అంతా చెల్లాచెదురుగా అయిపోయింది. ఇక ఆంధ్రలో సీఎం జగన్ పెట్టే కేసులకు బయటపడి, బయటకు రావటం లేదు. టీడీపీ ముఖ్య నాయకులు కూడా యాక్టివ్ గా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కేవలం చంద్రబాబు, లోకేశ్ ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు మాత్రం నాయకులు మీటింగ్ లకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేందుకు టీడీపీ ప్లాన్ వేస్తోంది.

 

నందమూరి, నారా కుటుంబాలు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధి చేసినట్లు తెలిసింది. ఎలాగైనా పార్టీని గెలిపించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి రావాలని భావిస్తున్నారని కీలకమైన సమాచారం ఉంది. విమర్శకులు సైతం వీరు ముగ్గురు కలిసి వస్తే పక్కాగా రికార్డులు క్రియేట్ అవుతాయని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -