TDP: ఇలాగైతే టీడీపీ బ‌తికి బ‌ట్ట క‌ట్టేదెట్టా? ఆ టీడీపీ నేత అలా అన్నారా?

TDP: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం యువగలం పాదయాత్రలో పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పాదయాత్రలో భాగంగా అన్ని జిల్లాలలోని నియోజకవర్గాలలో లోకేష్ పర్యటిస్తున్నారు. అయితే ఈయన పాదయాత్ర పెద్దగా పార్టీకి ఏ విధమైనటువంటి ప్రయోజనాలను తీసుకురావడం లేదని ఈయన పాదయాత్ర పై సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా మహానాడు కార్యక్రమంలో భాగంగా లోకేష్ అతని బ్యాచ్ వ్యవహరించిన తీరు సొంత పార్టీ సీనియర్ నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి పార్టీకి ఎంతో కీలకంగా పని చేస్తున్నటువంటి ఓ సీనియర్ నాయకుడు తాజాగా లోకేష్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హించిన మ‌హానాడులో మొద‌టి రోజు శ‌నివారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

 

ఈ వేడుకలు సుమారు 400 మంది వేదికపై కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.వేదిక‌పై పిల్ల బ్యాచ్‌, కింద వీఐపీ గ్యాల‌రీల్లో ముఖ్య నాయ‌కులు కూచోవ‌డం సీనియ‌ర్ నాయ‌కుడి కంట ప‌డింది. దీంతో వేదిక‌పై కూచున్న పిల్ల బ్యాచ్ ఎవ‌రో తెలుసుకుందామ‌ని ఆరా తీశారు. వీళ్లంతా లోకేశ్ టీమ్ అనే స‌మాధానం …ఆయ‌న‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించాయి. ఈ క్రమంలోనే లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

 

ఈ సందర్భంగా సదరు సీనియర్ నేత మాట్లాడుతూ లోకేష్ ఒక చిల్లర నాయకుడు. అతని కారణంగానే తెలుగుదేశం పార్టీ బ్రష్టు పట్టిపోతుందని ఇది చాలదన్నట్టు అతనికి ఇలాంటి చిల్లరోళ్ళు కూడా తోడయ్యారని మండిపడ్డారు. ఇలాగైతే తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్టకట్టేలా అని ప్రశ్నించారు. మహానాడు వేదికపై పెద్దవారికి గౌరవం ఇవ్వాలన్న ఇంకిత జ్ఞానం లోకేష్ కే లేకపోతే ఆయన టీంకు ఏముంటుంది అంటూ సదరు నేత లోకేష్ వ్యవహార శైలి పై తీవ్రస్థాయిలో మండిపడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -