Sana: అలా చేస్తేనే సినిమా ఛాన్స్ లు.. సనా సంచలన వ్యాఖ్యలు!

Sana: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో వివిధ భాషలలో సుమారు 600కు పైగా సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సనా ఒకరు. ఈమె కన్నడ, తెలుగు, తమిళ ,మలయాళ భాషలలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ప్రస్తుతం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలు సీరియల్లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

 

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సన మాట్లాడుతూ తనకు పదవ తరగతిలోనే పెళ్లి చేశారని అయితే చిన్నప్పటినుంచి తనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండడంతో తన అత్తమామల ప్రోత్సాహంతో తాను ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.చాలామంది మీ కోడల్ని ఇలా బయట తిప్పుతున్నారు తనకు కనీసం బుర్కా కూడా వేయలేదు అని చెప్పినప్పటికీ తన అత్త మామయ్యలు వీటిని పెద్దగా పట్టించుకోకుండా తనని ప్రోత్సహించారని తెలిపారు.

ఇక ఇండస్ట్రీలో తనకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చే సమయానికి తనకు పిల్లలు కూడా పుట్టారని తెలిపారు. అయితే పిల్లలు ఉన్నారనే విషయం తెలియడంతో తనకు కొన్ని సినిమా అవకాశాలు తప్పిపోయాయని తెలిపారు. అలాగే కొందరు దర్శకులు సినిమాలలో అవకాశాలు రావాలంటే తాము చెప్పిన విధంగా చేయాలని తెలిపారు. కొందరు పొట్టి దుస్తులు వేసుకొని నటించమని చెప్పగా మరికొందరు స్విమ్ సూట్ వేసుకొని నటించాలని చెప్పారు.

 

ఇలా సినిమా అవకాశాలు రావాలంటే దర్శకులు చెప్పిన విధంగా దుస్తులు ధరించి నటించాలని చెప్పడంతో తాను నిర్మొహమాటంగా నో అని చెప్పానని ఇలా చెప్పడం వల్ల తనకు హీరోయిన్ గా అవకాశాలు కోల్పోయాయని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక తాను ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ హిందూ దేవుళ్ళ పాత్రలో నటించడానికి ఏమాత్రం అభ్యంతరం లేదని తెలిపారు. నేను దుర్గాదేవి పాత్రలో నటించాను అంటే అమ్మవారే తనని ఆ పాత్రలో నటించాలని కోరుకున్నప్పుడు కాదనడానికి నేనెవరు అంటూ సమాధానం చెప్పారు. ఇలా తాను కులమతాలకు వ్యతిరేకిని కాదని అందుకే శ్రీరామరాజ్యం సినిమాలో కూడా తాను కైకేయి పాత్రలో నటించానని ఈ సందర్భంగా తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -