Kidney Stones: ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కిడ్నీలో రాళ్లు వస్తాయా?

Kidney Stones: ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్లు పడటం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా కిడ్నీ స్టోన్స్ సమస్య ఇబ్బంది పడుతున్నారు. ప్రతిత రోజుల్లో ఎక్కువమంది బాధపడుతున్న వాటిలో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా ఒకటి. అయితే ఇలా కిడ్నీలో రాళ్లు పడడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. అందులో రక్తంలో ఎక్కువ క్యాల్షియం ఉండడం, విటమిన్ డి సప్లిమెంట్లని ఎక్కువ రోజులు తీసుకోవడం, అదేవిధంగా పాలకూర,నట్స్, చాకోలెట్, వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం అదేవిధంగా తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువుని కలిగి ఉండటం, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ని తీసుకోవడం లాంటివి కిడ్నీలో రాళ్లు పడటానికి ఎక్కువ కారణాలుగా చెప్పుకోవచ్చు.

అయితే కిడ్నీలో రాళ్లు పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందుకోసం ఏం చేయాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది రునీరు తగినంత తీసుకోరు. దానివల్ల శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుంది. ఈ డిహైడ్రేషన్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా నీటిని తాగాలి. కిడ్నీలో రాళ్లు పడకుండా ఉండడం కోసం ఇది ఒక మంచి రెమిడి అని చెప్పవచ్చు. అలాగే ఆరెంజ్ జ్యూస్.. ఆరెంజ్ పండు అన్నది ఒక రుచికరమైన పండు. దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరెంజ్ తినడం వల్ల ఆ విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఆరంజ్ ను తినడంతో పాటు క్రమం తప్పకుండా నారింజ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.

 

పుచ్చకాయ జ్యూస్ లేదా పుచ్చకాయ తినడం. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వేసవిలో పుచ్చకాయ నువ్వు ఎంత బాగా తింటే అంత మంచిది. ఇది కిడ్నీ శుభ్రపరచడానికి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే నిమ్మకాయ నీరు. నిమ్మకాయ నీరు వేసవిలో విశ్రాంతిని ఇవ్వడంతో పాటు కిడ్నీలోని రాళ్ళను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది. నిమ్మకాయ నీరు తరుచు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు బయటకు వెళ్లిపోతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -