Ants: చీమలకు ఆహారం పెడితే దేవుని అనుగ్రహం.. అసలేం జరిగిందంటే?

Ants: మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎర్ర చీమలు కనిపిస్తే వెంటనే వాటిని చంపేస్తూ ఉంటారు.. నల్ల చీమలు కనిపిస్తే వాటిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది నల్ల చీమలను కూడా చంపేస్తూ ఉంటారు. కేవలం కొంతమంది మాత్రమే నల్ల చీమలకు ఆహారాన్ని వేస్తూ ఉంటారు. నల్ల చీమలు మనకు ఎటువంటి హాని చేయవు. కానీ ఎర్ర చీమలు కుట్టడం వల్ల దద్దుర్లు రావడంతో పాటు మంటగా నొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది.

అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చీమలకు ఆహారాన్ని దానంగా వేయడం వల్ల కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మీ జాతక చక్రంలో శని మంచి స్థితిలో ఉండి, గోచారంలో గురుబలం ఉంటే ఏలినాటి శని ప్రభావం పెద్దగా పడదు. ఈ దోషాలు ఉన్నట్లయితే శనికి తైలాభిషేకాలు చేయడం, జపాలు చేసుకోవడం వంటివి చేస్తే మంచి కలుగుతుంది. అలాగే చీమలకి పంచదార వేయడం, తేనె ఇవ్వడం వంటివి చేస్తే కూడా శని బాధలు పోతాయి. అలాగే బియ్యం పిండిలో చక్కెర లేదా బెల్లం కలిపి చీమలకు పెట్టాలి. లేదా వుట్టి చక్కెర అయినా పెట్టవచ్చు.

 

ఇలా చేస్తే పదివేలమందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది. ఇది ఇళ్ళల్లో, మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో కాకుండా దూరంగా, చీమలుండే చోట పెట్టాలి. అలాగే దానం చెయ్యగలిగిన వాళ్ళు కూడా ఒకసారి చీమలకి చక్కెర వేస్తే పదివేలమందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది. చీమలకి చక్కెర వేస్తే పదివేలమందికి దానం చేసిన పుణ్యం వస్తుందని అత్యాశతో అలా చెయ్యకూడదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -