SBI: ఎస్బీఐలో ఇలా పెట్టుబడి పెడితే భారీగా ఆదాయం పొందే ఛాన్స్.. కానీ?

SBI: వివిధ రంగాల్లో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. కానీ సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు చాలా తక్కువ. ఎందుకంటే ఆయా పెట్టుబడుల గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటమే. మెుదట నమ్మకమైన ఇన్వెస్టింగ్ వే ని ఎంచుకోవటం ముఖ్యం. అందుకోసం ఏటీఎం క్యాబిన్ల పెట్టుబడిని తెచ్చింది SBI. ఈ వ్యాపారంలో తక్కువ పెట్టుబడికే ఎక్కువ లాభాలు ఇస్తోంది స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా.

ఎస్బీఐ ATM ఫ్రాంచైజీ గురించి చాలా మందికి తెలియదు. నిజం చెప్పాలంటే ఈ వ్యాపారం చేయడం అంత తేలికైన పని కాదు. కానీ శ్రద్ధపెట్టి చేస్తే మాత్రం మంచి లాభాలు ఉంటాయి. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాపారానికి కేవలం రూ. 5 లక్షల పెట్టుబడి అవసరం. నెలకు 70 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ ఒప్పందాన్ని ఎస్బీఐతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

 

ఏటీఎం క్యాబిన్ నిర్మించాలంటే 50-80 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఇది ATMల నుండి సుమారు 100 మీటర్ల దూరంలో కూడా ఉండాలి. ప్రజలు సులభంగా గుర్తించగలిగే ప్రదేశంలో లొకేషన్ తప్పనిసరిగా ఉండాలి. కాంక్రీటుతో చేసిన పైకప్పు, సిమెంటుతో చేసిన గోడను కలిగి ఉండటం చాలా అవసరం. ఇంకా ఆధార్, పాన్ కార్డ్ మరియు ఓటర్ ID
రేషన్ కార్డ్ మరియు విద్యుత్ బిల్లు, పాస్ బుక్, GST సంఖ్య అవసరం.

 

బ్యాంక్ మీకు ప్రతి లావాదేవీకి నగదు రూపంలో రూ. 8 మరియు ప్రతి నగదు రహిత లావాదేవీకి 2 రూపాయలు, బ్యాలెన్స్ చెక్ మరియు నిధుల బదిలీ మొదలైనవి చెల్లిస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఎస్బీఐ వెబ్ సైట్ లేదా సమీప బ్యాంకు బ్రాంచ్ ని కలవండి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -