Temple: ఈ దేవుని ఆలయం ప్రత్యేకతల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Temple: భారతదేశంలో ఎంతో మంది దేవుళ్ళు ఉండడంతో పాటు ఎన్నో రకాల ఆలయాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క ప్రదేశంలో ఉండే దేవుళ్ళు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నారు. అంతేకాకుండా ఆలయ చరిత్రలు, ఆలయ విశిష్టతలు తెలుసుకొని భక్తులు ఆలయాలకు ప్రత్యేకంగా తరలి వస్తూ ఉంటారు. భారతదేశంలో ప్రత్యేకతలు కలిగిన ఆలయాలు వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పవచ్చు. ఆ ఆలయంలో ఉన్న దేవుని మహిమలు దేశం నలుమూలల వ్యాప్తి చెందడంతో దేశవ్యాప్తంగా అటువంటి మహిమ ఉన్న ప్రత్యేకతలు కలిగిన ఆలయాలకు తరలి వస్తూ ఉంటారు.

ఉదాహరణకు భారతదేశంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. అలా ప్రత్యేకతలు కలిగిన ఆలయాలలో మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో నరసింహ స్వామి కొలువై ఉన్నారు. స్వామివారికి ప్రసాదంగా పానకాన్ని సమర్పిస్తూ ఉంటారు. అంతే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టిన ఆ పానకాన్ని పంచుతూ ఉంటారు ఆ ఆలయ అర్చకులు. ప్రతి ఏకాదశి రోజున ఉదయం 5 గంటలకు స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు.

 

ఆరోజు నా స్వామివారికి ఉన్న కవచాలని తీసేసి స్వామివారికి ఇరువైపులా ఉన్న శంకు భక్తులు దర్శించుకోవచ్చు. ఆ ఆలయంలో ఎంతో పానకం బెల్లం వేసినా కూడా ఒక ఈగ కానీ దోమకాని ఆ ప్రదేశంలోకి రాకపోవడం నిజంగా స్వామివారి లీలా అని చెప్పవచ్చు. సూర్యాస్తమయం లోపునే స్వామి వారిని దర్శించుకోవాలి. ఎందుకంటే సూర్యాస్తమయం తరువాత దేవతలు స్వామివారిని పూజిస్తూ ఉంటారట. అక్కడ ఉండే స్వామిని పానకాల రాయుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. తర్వాత స్వామివారికి కొన్ని నైవేద్యాలు సమర్పించి వెంటనే ఆలయాన్ని మూసివేస్తారు. అక్కడ ఉన్న మహా ప్రత్యేకత ఏమిటంటే మనం స్వామివారికి ఎంత పాలకం అయితే సమర్పిస్తామో అందులో కరెక్ట్ గా సగభాగం స్వామి వారు తాగేసి మిగతా సగభాగం భక్తుల కోసం ఉంచుతారట. అంతేకాకుండా మనం నీరు తాగినప్పుడు ఏ విధంగా అయితే గుటకల శబ్దం వస్తుందో అదే విధంగా స్వామివారికి పానకం సమర్పించినప్పుడు కూడా అదే విధంగా గుటకల శబ్దం వస్తుంది అని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -