Nara Lokesh: మంగళగిరిలో లోకేశ్ ఎమ్మెల్యే కావడం పక్కా.. మెజార్టీపై మాత్రమే ఆయన దృష్టి పెట్టారా?

Nara Lokesh: ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి మంగళగిరి, పిఠాపురంపై ఉంది. మంగళగిరి నుంచి టీడీపీ తరుఫున నారాలోకేష్, పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వీరిద్దరూ ఓడిపోయారు. ఒకరు జనసేన పార్టీ అధినేత అయితే.. మరొకరు టీడీపీకి భవిష్యత్ రథసారధి. దీంతో.. ఇద్దరిపై పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతల నుంచి సెటైర్లు పడ్డాయి. దీంతో.. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేస్తున్న స్థానాలపై అందరిదృష్టి పడింది. పవన్ ఇప్పటికే ఆపరేషన్ పిఠాపురం మొదలు పెట్టారు. ఇక.. నారాలోకేష్ విషయానికి వచ్చినట్టు అయితే.. ఆయన ఐదేళ్లుగా అక్కడ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఎన్నికల కోసం ఆయన మంగళగిరిలో పని చేయడం లేదు. తనపై వచ్చిన విమర్శలను తిప్పి కొట్టి.. గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నిజానికి ఆయన గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయడం సవాల్ అనే చెప్పాలి. సర్వేలు అన్ని లోకేష్ ఓడిపోతారనే చెప్పాయి. కానీ, లోకేష్ మాత్రం అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. కానీ, నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోలేదు. ఓటమికి భయపడకుండా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని బలపరిచేందకు శాయశక్తలు కృషి చేస్తున్నారు.

ఐదేళ్లు తిరిగే లోపు మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా? అనే దగ్గర నుంచి లోకేష్ మెజార్టీపై బెట్టింగులు వేసే స్థాయికి చేరారు. అయితే.. దాని కోసం ఆయన స్థానికంగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. నియోజకవర్గంలో సాయంత్రం సమయంలో వృద్దులు కూర్చోవడానికి సొంతనిధులతో రెండు పార్కులను అభివృద్ధి చేశారు. లోకేష్ కార్యక్రమాల ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. రెండు నెలల్లో మంగళగిరిలో వైసీపీ ముగ్గురు అభ్యర్థులను మార్చింది. మొదట ఆళ్ల రామకృష్ణా రెడ్డి పేరును పరిశీలించారు. అయితే, అక్కడ బీసీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో గంజి చిరంజీవిని తెరపైకి తెచ్చారు. అయితే.. బీసీలు కూడా టీడీపీకే జై కొడుతున్న పరిస్థితి ఉండటంతో మళ్లీ పేరు మార్చారు. మహిళ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొని వచ్చి మురుగుడు లావణ్యను బరిలో దించుతున్నారు.

ప్రత్యర్థితో సంబంధం లేకుండా లోకేష్ ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎవరి ఇంట్లో అయినా శుభకార్యం ఉంటే వారికి లోకేష్ నుంచి శుభాకాంక్షలు వెళ్తాయి. ఎవరింట్లో అయినా కష్టం వస్తే లోకేష్ నుంచి భరోసా వెళ్తుంది. అలా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అందుకే, జగన్ అభ్యర్థులను మార్చి మార్చి చివరికి బీసీ మహిళను రంగంలోకి దించారు. ఆమె గెలుపును జగన్.. ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పెట్టారు. కానీ, ఆర్కేకు కూడా సీన్ అర్థం అయింది. అందుకే పెద్ద యాక్టివ్ గా లేరు. ఆర్కే తీరు కూడా మురుగుడు లావణ్యను ఓడించేలాగే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. నారా లోకేష్ గత ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ ప్రజలకు ఓ మాట ఇచ్చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మీకు అండగా ఉంటానని అన్నారు. చెప్పినట్టే చేస్తున్నారు. కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే ఎన్నికలప్పుడే కనిపిస్తున్నారు. ప్రజలు వీరిద్దరి మధ్య తేడాను గమనించారు. ఓడిపోయినా.. ఇలా చేస్తున్నారంటే.. గెలిస్తే ఇంకెంత చేస్తారో అని స్థానిక ప్రజలు అనుకునేలా లోకేష్ చేశారు. దీనికి తోడు పోల్ మేసేజ్‌మెంట్‌కు కూడా లోకేష్ మంగళగిరిలో ఒక వ్యవస్థను సిద్దం చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -