Nara Lokesh: మంగళగిరిని గచ్చిబౌలిలా మారుస్తాం.. అద్భుతమైన హామీలతో ఈసారి లోకేశ్ గెలుపు కచ్చితమేనా?

Nara Lokesh: తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా మంగళగిరిలో టీడీపీ గెలవలేదు. అలాంటి స్థానంలో పోటీ చేస్తానని రంగంలోకి దిగిన టీడీపీ జాతీయ కార్యదర్శి 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే.. పోయిన చోటే సాధించాలని లోకేష్ మరోసారి అక్కడి నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా లోకేష్ సొంత నిధులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పుడు కొత్తకొత్త హామీలతో మంగళగిరిలో దూసుకుపోతున్నారు. మంగళగిరిని ఐటీ హబ్ చేస్తానని హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలా మారుస్తానని చెప్పారు. తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలోనే చాలా కంపెనీలు మంగళగిరికి తీసుకొని వచ్చానని ఆయన గుర్తు చేశారు. అయితే.. వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చక ఇక్కడి నుంచి కంపెనీలు అన్ని తరలిపోయని చెప్పారు.

రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు అవుతున్నా.. ఇక్కడి యువత పక్క రాష్ట్రాలకు ఉపాది కోసం తరలిపోతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కూడా టీడీడీకి మరో అవకాశం ఇచ్చి ఉంటే రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. తాను మంగళగిరిలో పోటీ చేస్తాననే ఆలోచన లేనప్పుడే ఇక్కడి ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చానని చెప్పారు. భవనాలు నిర్మించి, రాయితీలు ఇచ్చి కంపెనీలు తీసుకొచ్చామని చెప్పారు. హెచ్‌సీఎల్ లాంటి కంపెనీలు విజయవాడకు వచ్చాయని అన్నారు. కానీ, 2019లో అధికారం చేతులు మారిన తర్వాత రాష్ట్రం ధ్వంసం అయిపోయిందని లోకేష్ విమర్శించారు. అయితే.. ఎవరు అదైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ ని మంగళగిరిలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక్కడే బంగారం తయారీ, నగల డిజైనింగ్ ఉత్పత్తి జరిగేలా చూస్తామని అన్నారు. రెండు వేల కోట్లతో నియోజవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆళ్ల రామకృష్ట ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. పక్కనే ఉన్న కృష్ణానది నీటిని కూడా నియోజకవర్గంలోకి తీసుకు రాలేకపోయారని మండిపడ్డారు. స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

నియోజకవర్గంలో సాయంత్రం సమయంలో వృద్దులు కూర్చోవడానికి పార్కులు కూడా లేవని ఆయన గుర్తుచేశారు. సొంతనిధులతో రెండు పార్కులను తాను అభివృద్ధి చేశానని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరిన్ని పార్కులు అందుబాటులోకి తీసుకొని వస్తామన్నారు. టీడీపీకి అనుకూలంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే… వారిపై వైసీపీ నేతలు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. 2 నెలలు ఓపిక పడితే అలాంటి అక్రమ కేసులను నుంచి బాధితులను బయటపడేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. తనకు కాల్ చేయాలని అన్నారు. సమస్య ఎంతటిదైనా బాధితుల తరఫున పోరాటం చేయడానికి తాను సిద్దమని హామీ ఇచ్చారు. ఇక వైసీపీ హయాలో దేవాలయాలపై దాడులు విపరీతంగా పెరిగాయని లోకేష్ గుర్తు చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం, అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతి కావడం.. ఇవన్ని వైసీపీ ప్రభుత్వం కుట్రలోనే భాగమేనని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో మతపరమైన దాడులు ఎక్కడా లేవని.. ప్రశాంతమైన వాతావరణం ఉండేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులకు దిగినవారిని వదిలిపెట్ట ప్రశక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాని నాణ్యమైన విమాన సర్వీసులు లేవని విమర్శించారు. గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. తమ ప్రభుత్వంలో సింగపూర్ నుంచి సర్వీలు అందుబాటులోకి తీసుకొని వచ్చామని అన్నారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సర్వీసులు రద్దు అయ్యాయని మండిపడ్డారు. రాబోయే ప్రభుత్వంలో మెగురగైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని లోకేష్ చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -