Sai Pallavi: సాయిపల్లవి చేసిన ఈ పని గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Sai Pallavi: సినీ ఇండస్ట్రీలోకి కొందరు అనుకోకుండానే వచ్చేస్తుంటారు. తమ చదువులు వేరైనా, అదృష్టం వరించి ఈ రంగంలో ఆఫర్లు వస్తుంటాయి. అలానే ఇలా రాణిస్తున్నారు హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. డాక్టర్‌ అవ్వాల్సిన సాయిపల్లవి యాక్టర్‌ అయ్యారు. అయితే చాల మందికి ఈ బ్యూటీ లైఫ్‌ గురించి తెలియదు. సాయి పల్లవి బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి అని. ఈమె ఒక చానల్‌ నిర్వహించిన యార్‌ ప్రభుదేవా అనే కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.

సాయిపల్లి ఆ తర్వాతే మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంతో కథానాయక పరిచయం అయ్యారు. ఆ ఒక్క చిత్రం సాయిపల్లవి దశ, దిశను ఒక్క సారిగా మార్చేసింది. వెంటనే తెలుగులో అవకాశాలు తలుపుతట్టాయి. తెలుగులో ఆమె నటించిన ఫిదా, లవ్‌స్టోరీ, శ్యామ్‌ సింగరాయ్‌ వంటి చిత్రాలు విజయం సాధించడంతో కోలీవుడ్‌ నుంచి కాలింగ్‌ వచ్చింది. తమిళంలో ధనుష్‌కు జంటగా మారీ–2, సూర్యతో ఎన్‌జీకే మూవీస్‌లో నటించారు. అయితే ఇక్క డ మారీ–2 చిత్రం మినహా ఇతర చిత్రాలేవీ ఆశించిన సక్సెస్‌ సాధించలేదు.

 

ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌ సరసన నటిస్తున్న ఒక్క చిత్రం మాత్రమే ఈమె చేతిలో ఉంది. ఇటీవల ఇద్దరు తమిళస్టార్‌ హీరోల సరసన నటించే రెండు అవకాశాలను సాయిపల్లవి తిరస్కరించినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరు అగ్రహీరోలే. వారే నటుడు విజయ్, అజిత్‌ కావడం విశేషం. విజయ్‌ కథానాయకుడు నటించిన తాజా చిత్రం వారిసులో హీరోయిన్‌గా ముందు సాయిపల్లవినే అనుకున్నా రట.

 

ఆ చిత్రంలో కథానాయక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె నో చెప్పినట్లు వినికిడి. ఆ తర్వాత నటి రష్మికను ఎంపిక చేశారు. ఆమె కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేదని తెలిసినా విజయ్‌ సరసన నటించాలన్న కోరికతోనే వారిసు చిత్రానికి సైన్‌ చేసింది. సాయిపల్లవి నిరాకరించిన మరో చిత్రం వలిమై. అజిత్‌ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు మొదట సాయిపల్లవినే అనుకున్నారు. అయితే ఆ పాత్రకు ప్రాముఖ్యత లేకపోవడంతో ఆమె నిరాకరించినట్లు తెలిసింది. నిజానికి ఈ రెండు చిత్రాల్లోనూ గ్లామర్‌కు అవకాశం లేకపోయినా నటనకు కూడా అవకాశం లేకపోవడంతో సాయిపల్లవి నో చెప్పిందని సినీ వర్గాల ద్వారా తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -