Chandra Babu Naidu: ఈ ఏడాది చంద్రన్న జాతకం ఎలా ఉందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Chandra Babu Naidu: హిందువులకు ఎంతో పెద్ద పండుగ అయినటువంటి వాటిలో ఉగాది పండుగ ఒకటి. మార్చి 22వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టి పెద్ద ఎత్తున ఉగాది పండుగను జరుపుకున్నారు. ఇక ఉగాది పండుగ అంటేనే ఆ ఏడాది మొత్తం తమ జాతకాలు ఎలా ఉన్నాయోనని ప్రతి ఒక్కరు కూడా పంచాంగ శ్రవణం వినడమే కాకుండా వారి జాతకాలను చూసుకుంటారు.

 

ఇలా రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని సినిమా సెలబ్రిటీలు సాధారణ ప్రజలు కూడా వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుందోనని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ ఏడాది ఎలా ఉండబోతుందో పండితులు వెల్లడించారు. 1951 ఏఫ్రిల్ 20న చంద్రబాబు నాయుడు జన్మించారు. చైత్ర శుద్ధ త్రైయోదశి శుక్రవారం జన్మించిన ఆయనది కూడా కన్యారాశి. అలానే వీరు హస్త నక్షత్రంలో జన్మించారు. ఇక ఈ ఏడాది చంద్రబాబు నాయుడు జాతకంలో కొన్ని యోగాలు ఉన్నాయి.

రాజయోగాలు.. అందులోనూ అద్వితీయమైనటువంటి యోగాలు చంద్రబాబుకు కలగనున్నాయి. గురుడి స్థానాన్ని బట్టి హంసయోగం, రవి-బుధుడు కలిసి ఉండటం బుదాదిత్య యోగం, ప్రత్యేకించి 1, ,4, 7,10 స్థానాల్లో చంద్రుడు- గురుడు ఉన్నట్లు పండితులు తెలిపారు. 2024 మే నెలకు శుక్రుడి అంతదశ అత్యంత అనుకూలంగా ఉంది. ఇక ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక రాజకీయాలలో ఈయనకు అధికారంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

దేశ రాజకీయాలలో కూడా అధికార పార్టీతో చంద్రబాబు భాగస్వామ్యం అయ్యే పరిస్థితిలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది తను పాత సిద్ధాంతాలను పక్కనపెట్టి కొత్త వ్యూహాలతో ముందుకు పయనించనున్నారు.చంద్రబాబు నాయుడుకి మంచి యోగాలు ఉన్నాయని అయితే ఈయన రాజకీయాలలో ముందుకు సాగడం కోసం ఇతర పార్టీలతో భాగస్వామ్యం పరిస్థితులు కనబడుతున్నాయంటూ పండితులు తెలియజేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -