Tarak: తెలంగాణలో తారక్ ఆస్తులు తెలిస్తే గుండె గుభేలుమనాల్సిందే!

Tarak: తెలుగు సినిమా రంగంలో ఎంతోమంది యంగ్ హీరోలు తమ ట్యాలెంట్ తో జనాల్ని ఆకట్టుకుంటున్నారు. అయితే వారందరిలోకి అన్ని విషయాల్లో ది బెస్ట్ ఇచ్చే యాక్టర్ ఎవరు అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాల్సిందే. నటన పరంగా చూసినా, డ్యాన్స్ విషయానికి వచ్చినా, కామెడీ టైమింగ్ చూసినా, డైలాగ్స్ చెప్పాల్సి వచ్చినా.. ఇలా నవ రసాలను పలికించగల మోస్ట్ ట్యాలెంటెడ్ యంగ్ హీరో తారక్.

 

‘స్టూడెంట్ నెంబర్ వన్’తో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తారక్.. ‘ఆర్ఆర్ఆర్’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు చేస్తున్న ఎన్టీఆర్.. సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా బాగా సంపాదించాడు. తాజాగా ఎన్టీఆర్ ఆస్తులకు సంబంధించిన ఓ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తారక్ కు భారీగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తుండగా.. అవన్నీ తన పేరు మీద లేకపోవడం విశేషం.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. తన సంపాదనను భూములు కొనడానికి, కార్లు, బైకులు కొనడానికి, పిల్లల పేర్ల మీద కొంత ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడానికి తారక్ ఇష్టపడుతుంటాడని సమాచారం. ఇండస్ట్రీలో టాక్ ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 200 ఎకరాల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో డిమాండ్ ఉన్న ఏరియాల్లో ఎన్టీఆర్ కు భూములు ఉండగా.. వాటి విలువ కొన్ని లక్షల కోట్లు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

అయితే తారక్ తన పేరు మీద ఎలాంటి ఆస్తులను ఉంచుకోలేదని తెలుస్తోంది. తన తల్లి, భార్య మరియు ఇద్దరు పిల్లల పేర్ల మీద తారక్ తన ఆస్తులను పెట్టినట్లు తెలుస్తోంది. తన ఇద్దరు పిల్లల పేర్ల మీద ఇప్పటికే ఆస్తులను పంచేసిన తారక్.. తన మీద మాత్రం ఎలాంటి ఆస్తులను పెట్టుకోలేదట. మొత్తానికి టాలీవుడ్ లో భారీగా ఆస్తులను కలిగిన హీరోల జాబితాలో తారక్ పేరు ఖచ్చితంగా టాప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -