Ravi Teja: రవితేజ, ఆయన భార్య మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి తర్వాత ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారిన హీరో ఎవరంటే చాలు రవితేజ పేరు గుర్తుకు వస్తూ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. మొదట కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. అయితే రవితేజ కెరియర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో అతని ఇష్టం లేకున్నా కూడా పెళ్లి చేశారట. ఈ విషయం చాలా మందికి తెలియదు. రవితేజ కు ఎలా అయినా పెళ్లి చేయాలని భావించిన రవితేజ తల్లి తన బంధువుల్లో ఉన్న ఒక అమ్మాయిని చూసిందట. ఆమె ర‌వితేజ‌కు మ‌ర‌ద‌లు అవుతుంది. ఆదే స‌మ‌యంలో ఒక రోజు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు రవితేజ తల్లి కళ్యాణిని చూసి తన కొడుక్కి ఈ అమ్మాయి బాగుంది. త‌న కొడుక్కి తగ్గ భార్య అవుతుందని భావించి ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మా ఇంటికి కోడలుగా మీ అమ్మాయిని పంపండి అని మొహ‌మాటం లేకుండా అడిగేసిందట.

దీంతో రవితేజ కూడా హీరోగా మారడంతో వారు కూడా త‌మ కుమార్తెను రవితేజకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒకే చెప్పారట. ఇదే సమయంలో ఇదే విషయాన్ని రవితేజకి చెబితే ఆమె నాకంటే 12 సంవత్సరాలు చిన్నది. ఎలా పెళ్లి చేసుకోను అని మొత్తుకున్నా అమ్మ ఫోర్స్ చేయటంతో క‌ళ్యాణిని 2002 మే 26న పెళ్లి చేసుకున్నాడ‌ట‌. ఇక రవితేజకు కళ్యాణితో పెళ్లి జ‌రిగాక‌ ఇద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.
ఇక వీరిద్దరికీ ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఇదే సమయంలో రవితేజ- కళ్యాణిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో అప్పటినుంచి ఆయన సినీ కెరీర్ కూడా మరో లెవల్ కు వెళ్ళింది. వ‌రుస‌గా భారీ విజయాలు అందుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా నిలిచాడు. ఈ విధంగా రవితేజకు పెళ్లయ్యాకే ఆయన కెరీర్ స్వింగ్ అయ్యింద‌నే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -