Balayya: బాలయ్య భ‌గ‌వంత్ కేస‌రి రోల్‌కు ‘ ఎన్టీఆర్ దేవ‌ర ‘ సెకండ్ రోల్ కు ఉన్న లింక్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Balayya: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయనే సంగతి తారక్ కి బాగా తెలుసు అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అదే కాకుండా పాన్ ఇండియా మూవీ కావటంతో కొరటాల శివ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడంట. అందులోనూ తండ్రి పాత్ర 50 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఒక పెద్దాయన పాత్ర చేస్తున్నాడు.

ఎన్టీఆర్ ఇందులో ఆయనకి జోడిగా ఒక ప్రముఖ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆంధ్రవాలా, నా అల్లుడు, అదుర్స్ చిత్రాలలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసి మెప్పించాడు. దాంతో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కోసం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆయన అభిమానులు. దేవర చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటన చేశారు.

 

అయితే ఇప్పుడు చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఎన్టీఆర్ బాబాయి నందమూరి నట సింహం బాలకృష్ణ కూడా 50,60 ఏళ్ళ వయసున్న ఒక తండ్రి పాత్రని భగవంత్ కేసరి సినిమాలో పోషిస్తున్నాడు. ఇందులో ఈయనకి కూతురుగా ప్రముఖ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకి జోడిగా కాజల్ నటిస్తుంది.

 

తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే వయసు ఉన్న పాత్రలు ధరించడం.. ఆ సినిమాలు కూడా ఇంచుమించు ఓకే టైంలో రిలీజ్ అవ్వటం మీద ఇండస్ట్రీలో తెగ ఉత్కంఠ నెలకొంది. చూడాలి బాబాయ్ కొడుకుల ఇద్దర్లో ఎవరు విజయాన్ని దక్కించుకుంటారో. లేదంటే ఇద్దరూ కలిపి ఇండస్ట్రీని ఒక దుమ్ము దులుపుతారో. తెలియాలంటే సినిమాలు రిలీజ్ అయిన వరకు వెయిట్ చేయాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -