Heroines: ఈ హీరోయిన్ల సంపాదించిన డబ్బెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Heroines: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, హీరోయిన్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఓరకంగా చెప్పాలంటే హీరోల కన్నా హీరోయిన్లు తక్కువ కాలంలో ఎక్కువ అవకాశాలను కూడా పొందవచ్చు. అయితే హీరోయిన్లు అంటే కేవలం సినిమాల వరకే పరిమితం కావడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా.. వీళ్లు స్టార్ గా కొనసాగుతున్నప్పుడు డబ్బు సంపాదన మీద దృష్టిసారిస్తున్నారు.

 

ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ కూడా చేస్తూ హీరోయిన్లు బాగా సంపాదిస్తుంటారు. సౌత్ లో ఇలా సినిమాలతో పాటు ప్రమోషన్స్, యాడ్స్ ద్వారా విపరీతంగా సంపాదించిన టాప్ హీరోయిన్ల జాబితా ఇప్పుడు చూద్దాం. సౌత్ ఇండస్ట్రీల్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో టాప్ లో హీరోయిన్ నయనతార ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె ఇంకా టాప్ లోనే కొనసాగుతోంది.

 

గత రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ అలరిస్తున్న నయనతార ఇప్పటి వరకు రూ.165కోట్ల వరకు పోగేసిందని సమాచారం. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార సినిమాలకు.. తమిళంతో పాటు చాలా భాషల్లో మంచి డిమాండ్ ఉంది. నయనతార తర్వాత ఎక్కువగా సంపాదించిన హీరోయిన్ గా తమన్నా భాటియా నిలుస్తోంది. తమన్నా ఇప్పటి వరకు రూ.110 కోట్ల వరకు సంపాదించి ఉంటుందని సమాచారం. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లో కూడా తమన్నా తన హవాను కొనసాగిస్తోంది.

 

వీరిద్దరి తర్వాత స్థానంలో హీరోయిన్ అనుష్క శెట్టి నిలుస్తోంది. తెలుగులో టాప్ హీరోలందరితో కలిసి పని చేసిన అనుష్క శెట్టి.. ఇప్పటి వరకు సినిమాల ద్వారానే రూ.100 కోట్ల వరకు కూడబెట్టి ఉంటుందని సమాచారం. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుష్క.. ఈ మధ్యన గ్యాప్ తీసుకుంది. ఇక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత అనుష్క శెట్టి తర్వాతి స్థానంలో నిలుస్తోంది. సమంత సినిమాలు, యాడ్స్ ద్వారా ఇప్పటి వరకు రూ.89కోట్ల వరకు సంపాదించి ఉంటుందని సమాచారం. సమంత తర్వాత పూజా హెగ్డే రూ.50కోట్లు సంపాదిస్తే, రష్మిక మందన రూ.28కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -