Sobhan Babu: శోభన్ బాబు ఆస్తుల విలువెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Sobhan Babu: తెలుగు సినీ చిత్రసీమ ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు.ఇప్పటికీ ఈయన క్రేజ్ తగ్గలేదు అనడానికి యూ ట్యూబే సాక్షి. అవును యూ ట్యూబ్ లో శోభన్ బాబు సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఇప్పటికీ ఈయనంటే పడి చచ్చిపోయే లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈయన సినిమాలు టీవీల్లో ప్రసారమైతే.. టీవీలకు అతుక్కుపోయే అభిమానులున్నారు. అంతేకాదు ఫ్యామిలీ సినిమాలకు తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. నటనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో నేర్పిన సోగ్గాడు.\

 

ఆ రోజుల్లో శోభన్ బాబు సినిమాలు థియేటర్స్ లో రిలీజైతే.. ఆడవాళ్ల జాతర జరుగుతున్నట్లు ఉండేది. ఈయన సినిమాలకు ప్రత్యేకంగా ఆడవాళ్లకు ఒక టికెట్ ఇచ్చేవారంటే అర్థం చేసుకోవచ్చ ఆయనకు ఏ రేంజ్ లో లేడీ ఫ్యాన్స్ ఉండేవారో. మహిళా అభిమానులు ఈయనకు ఉన్నంత ఎవరికీ లేరు. అప్పట్లో శోభన్ బాబు కాలం చేసినప్పుడు.. ‘మా ఇంట్లో ఎంతోమంది హీరోలు ఉన్నా మా ఇంటి ఆడవాళ్లకు శోభన్ బాబు సినిమాలు అంటేనే ఇష్టం’ అని నటుడు చిరంజీవి, బాలకృష్ణలు చెప్పడం గమనార్హం.

 

అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కూడా చాలా ఉంది. శోభన్ బాబు ఓ గొప్ప వ్యాపారవేత్త కూడా. నేటికి దక్షిణ భారతదేశంలో శోభన్ బాబు కంటే డబ్బున్న హీరో మరొకరు లేరు. ఈ విషయం చెప్పింది ఆయన స్నేహితుడు మురళీ మోహన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి టాపిక్ వచ్చినపుడు ఆశ్చర్యపోయే నిజాలు చెప్పాడు. శోభన్ బాబు స్టార్ హీరోగా ఉన్నపుడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడని.. అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని చెప్పాడాయన. ఆయన చనిపోయే నాటికి ఆస్తి దాదాపు రూ. 80 వేల కోట్లు వరకు ఉంటుందని చెబుతున్నారు.

 

నేటికి కూడా చెన్నై శివార్లలో శోభన్ బాబుకు సంబంధించి కొన్ని వేల ఎకరాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆయనను చూసే నేను కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టినట్లు చెప్పాడు. మద్రాసులో ఆయన టైమ్ పాస్ కోసం పొద్దున్నే తన ఆస్తులు అన్నీ చూడ్డానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారని సినీ ఇండస్ట్రీలో టాక్

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -