Venkatesh: వెంకటేష్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Venkatesh:  తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇండస్ట్రీలో ఎంతోమందికి జీవనోపాధిని కల్పించారు. అంతేకాదు.. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు, హీరోయిన్లను పరిచయం చేశాడు. ఆయన ప్రొడక్షన్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ఆయన ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా రాణించారు. రామానాయుడికి ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా రాణిస్తుండగా.. మరొక్కరు చిత్ర పరిశ్రమలో సినీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు ఇండస్ట్రీలో వారికంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కలియుగ పాండవులు సినిమాతో తెరంగ్రేటం చేశారు. మొదటి సినిమాతో మంచి విజయం అనుకున్న వెంకటేష్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. వెంకటేష్ ఫ్యామిలీ సినిమాలోనే కాకుండా యాక్షన్ సినిమాల్లో నటిస్తూ మాస్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యాడు. అంతేకాదు.. వెంకీ కామెడీ టైమింగ్ కూడా అదుర్స్ అనే చెప్పాలి మరి.

ఈ మధ్యకాలంలో వెంకటేష్ నటించిన ‘నార‌ప్ప‌, ఎఫ్-3’ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వెంకటేష్ వెండితెరపై సందడి చేస్తూనే బుల్లితెరపై యాడ్స్ లోనూ న‌టిస్తున్నారు. ఒక్క విధంగా చెప్పాలంటే ఆయన రెండు చేతుల నిండా డ‌బ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం హీరో వెంకటేష్ ఎంత సంపాదిస్తున్నాడో, ఆయనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది.

అయితే హీరో వెంక‌టేష్‌కు తండ్రి నిర్మాత రామానాయుడు ద్వారా స్థిరాస్థుల‌తో పాటూ చ‌రాస్థులను కూడా వచ్చినట్లు తెలుస్తుంది. వెంకటేష్ యుక్త వయస్సు నుండి సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే వెంక‌టేష్ కేవ‌లం సినిమాల ద్వారానే రూ.2000 కోట్ల వ‌ర‌కూ ఆస్తుల‌ను సంపాదించినట్లు తెలుస్తోంది. అంతేకాక.. వెంకటేష్ తండ్రి రామానాయుడికి సైతం చెన్నైలో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికి వెంక‌టేష్, సురేష్ బాబు ఇంకా తమ ఆస్తులను పంచుకోలేద‌ని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -