Surendar Reddy-Venkatesh: వెంకటేశ్ సురేందర్ రెడ్డి కాంబోలో మూవీ.. అల్లుడికి డిజాస్టర్ మామకైనా హిట్టిస్తాడా?

Surendar Reddy-Venkatesh: వెంకటేష్ సైంధవ్ అనే సినిమాతో తెర మీదకి త్వరలోనే రానున్నారు. ఇది ఆయన 75వ సినిమా. అయితే 76వ సినిమా కోసం కూడా ఏర్పాట్లు పూర్తవుతున్నట్టు తెలుస్తున్నాయి. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తుంది. ఇది వెంకటేష్ మార్క్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో కూడి ఉంటుంది. ఇప్పటివరకు సురేందర్ రెడ్డి చేసినవని యాక్షన్ సినిమాలే కాని ఈసారి ఫ్యామిలీ అలాగే ఆక్షన్ ఎలిమెంట్స్ తో కూడా కలిపి వస్తున్నారు.

సురేందర్ రెడ్డి కెరీర్ గ్రాఫ్ కొంతవరకు బానే ఉన్నా ఈ మధ్య భారీ ఫ్లాపులతో ఉన్నారు. మొన్న మొన్ననే అఖిల్ కి పెద్ద డిజాస్టర్ అయిన ఏజెంట్ ని ఇచ్చారు మరి ఈసారి మామకైనా హిట్ పడుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాని సైన్ చేశారు. ఆ సినిమాకి ఆఫీస్ పనులు కూడా అయిపోయాయి కానీ పవన్ కళ్యాణ్ కొంచెం బిజీగా ఉండడంతో ఆ సినిమాని పోస్ట్ ఫోన్ చేశారు.

ఈ లోగా వెంకటేష్ తో 76వ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఇలా ఉంటే సైంధవ్ సినిమా డిసెంబర్ 22న విడుదలవుతుంది అని ముందు ప్రకటించారు కానీ సాలార్ సినిమా కూడా అదే రోజు రావడంతో దీన్ని ముందుకి తరలించారు. ఈ సినిమా మీద దగ్గుబాటి ఫాన్స్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వెంకీ మామ ఫుల్ సీరియస్ రోల్లో ఎలా ఉండబోతున్నారో తెలియాలంటే డిసెంబర్ వరకు ఎదురు చూడాల్సిందే.

మరి వెంకటేష్ సురేందర్ రెడ్డి తో తీయబోతున్న సినిమా టైటిల్, సాంగ్స్, హీరోయిన్ ఎవరో వంటి అప్డేట్స్ అన్ని త్వరలోనే ప్రకటిస్తాను అని చిత్ర బృందం చెబుతున్నారు. మరి ఈ సినిమా వెంకటేష్ కి మరోక హిట్ కాగలదా? ఫ్లాప్ స్ట్రీకులతో నడుస్తున్న సురేందర్ రెడ్డి కి ఒక కం బ్యాక్ రాగలదా? అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: తొలి విడత డబ్బు పంపిణీ దిశగా వైసీపీ అడుగులు.. కోట్లు చేతులు మారుతున్నాయా?

YSRCP: సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు మందు, భోజనంతో పాటు రోజువారీ కూలీ కూడా డబ్బులను కూడా అందజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కూటమి చేతిలో...
- Advertisement -
- Advertisement -