Heroine Trisha: హీరోయిన్ త్రిష గురించి ఈ నిజాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వాల్సిందే!

Heroine Trisha: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నాలుగుపదుల వయసులో ఉన్నప్పటికీ అచ్చం పాతికేళ్ల హీరోయిన్ గా అందచందాలతో ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న నటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 22 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా సినిమా అవకాశాలను అందులోను హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు.

ఇక తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమాలోనే కాకుండా ప్రస్తుతం ఈమె తమిళంలో ది రోడ్ అని సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వసీగరన్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

తాజాగా త్రిష పుట్టినరోజు జరగడంతో ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ఈమె పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది అదేవిధంగా ఈ సినిమా లొకేషన్ లో దిగినటువంటి కొన్ని ఫోటోలను త్రిష సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ఇందులో త్రిష ఒక బాబుని ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

 

ఇక ఈ ఫోటోని చూసినటువంటి అభిమానులు త్రిష కూడా పెళ్లి చేసుకుని ఉంటే ఈపాటికి ఇలాంటి బాబుకి తల్లి అయి ఉండేవారని కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు ఈ సినిమాలో త్రిష తల్లి పాత్రలో నటించబోతున్నారని ఈమె తన కొడుకు పాత్రలో కనిపించబోతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. త్రిష 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఈమె ఎంతో బిజీగా గడుపుతూ పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -