Chalapathi: నటుడు చలపతిరావు గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Chalapathi: టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు తాజాగా గుండెపోటుతో మరణించారు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న చలపతిరావు గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఒకసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో దాదాపుగా ఐదున్నర దశాబ్దాల సినీ ప్రస్తావనంలో 1200 కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో సినిమాలలో తనదైన శైలిలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన చలపతిరావు మరణాన్ని అభిమానులు జీవించుకోలేకపోతున్నారు.

ఇకపోతే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలపతిరావు పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు. ఈయన కృష్ణాజిల్లా, పామర్రు మండలం బలిపర్రు లో 1944 మే 8న జన్మించారు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చలపతిరావు సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూడచారి 116 సినిమా దోచుని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బుద్ధిమంతుడు సినిమా తర్వాత మళ్లీ కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. విలన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది.

నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చలపతిరావు. కాగా చలపతిరావుకు ముగ్గురు సంతానం కాగా కుమారుడు రవిబాబు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రవిబాబు ముఖ్యంగా మురారి సినిమాతో మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇక రవిబాబు భార్య ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఒకసారి అగ్ని ప్రమాదంలో మరణించింది. ఆ తర్వాత మళ్లీ అతను రెండవ పెళ్లి చేసుకోలేదు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -