Soundarya: సౌందర్య కొడుకు గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Soundarya: అలనాటి అందాల తార దివంగత నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మహానటి సావిత్రి తర్వాత అలాంటి అందం అభినయం నటనతో ప్రేక్షకుల మదిని దోచుకున్నటువంటి వారిలో సౌందర్య ముందు ఉంటారు.ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా ఎంతోమంది తెలుగు ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకుంది.ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే విధి కన్నెర్ర చేసి తనని అనంత లోకాలకు తీసుకువెళ్లింది.

ఇలా హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య అకాల మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పాలి.ఇకపోతే సౌందర్య ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె తన చిన్ననాటి స్నేహితుడు రఘు అనే వ్యక్తిని 2003 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇలా వివాహమైన ఏడాదికి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.ఇక సౌందర్యం మరణించడంతో రఘు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని గోవాలో స్థిరపడ్డారు. ఇక తన భర్త పేరుపై సౌందర్య తన ఆస్తులన్నీ కూడా రాసిచ్చారు.

 

ఇక సౌందర్య మరణించడంతో సౌందర్య తల్లికి రఘుకి మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి. ఇకపోతే సౌందర్య మరణించే సమయానికి తనకు ఒక కుమారుడు కూడా ఉన్నారని అయితే ఆమె తనకు కుమారుడు ఉన్న విషయాన్ని బయట పెట్టలేదని ప్రస్తుతం ఆ కుమారుడు బాధ్యతలను రఘు చూసుకుంటున్నారనే వార్తలు అప్పట్లో బలంగా వినిపించాయి. ఇలా సౌందర్యకు కొడుకు ఉన్నారని తెలియడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు.

 

ఇక సౌందర్యకు నిజంగానే కొడుకు ఉన్నారా కావాలనే ఆమె ఆ విషయాన్ని బయట పెట్టలేదా అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయానికి వస్తే…సౌందర్య సన్నిహితుల సమాచారం ప్రకారం సౌందర్యకు కొడుకు ఉన్నారనే వార్తలను వాళ్లు పూర్తిగా ఖండించారు. సౌందర్య వివాహం చేసుకున్నప్పటికీ రెండు మూడు సంవత్సరాల వరకు పిల్లలను కనకూడదని నిర్ణయం తీసుకున్నారట. అందువల్లే తను పిల్లల కోసం ఎలాంటి ప్లాన్ చేయలేదని తనకు కొడుకు ఉన్నారంటూ వస్తున్నటువంటి వార్తలలో కూడా ఏ మాత్రం నిజం లేదని సౌందర్య సన్నిహితులు ఈ విషయంపై స్పందిస్తూ ఆ వార్తలను కొట్టి పారేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -