Jayasudha: జయసుధ మూడో భర్త ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Jayasudha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా తన యాక్టింగ్ తో మెప్పిస్తున్న నటి జయసుధ. హీరోయిన్ గా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో సినీ అభిమానులను అలరించిన జయసుధ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తోంది. అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా, నానమ్మగా చాలా సినిమాల్లో కనిపిస్తున్న జయసుధ.. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో దగ్గరైంది. ఎన్నో దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న జయసుధ.. వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది.

 

జయసుధ రెండో భర్త కొద్ది సంవత్సరాల క్రితమే మరణించగా.. ఆమె మూడో పెళ్లి చేసుకుందా అనే చర్చ సాగుతోంది. ఇందుకు కారణం జయసుధ ఓ వ్యక్తితో తరుచుగా, చాలా దగ్గరగా కనిపిస్తుండటమే అని సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అంటున్నారు. కమెడియన్ అలీ కూతురి ఫంక్షన్ లో సదరు వ్యక్తితో చాలా క్లోజ్ గా జయసుధ కనిపించింది. అలీ కూతురు మరియు అల్లుడితో కలిసి ఫోటోలు కూడా దిగిన జయసుధ, ఆమెతో ఉన్న వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఈ మధ్యనే జరిగిన విజయ్ సినిమా ‘వారీసు’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా జయసుధ సదరు వ్యక్తితో హాజరవడంతో.. జయసుధ మూడో పెళ్లి గురించి చర్చ మరింత ఊపందుకుంది. అయితే ఇప్పటి వరకు జయసుధ దీనిపై ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోగా.. ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అయితే జయసుధ మూడో పెళ్లి చేసుకుందా? లేదంటే పెళ్లి చేసుకోబోతోందా? అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

 

కాగా జయసుధ హీరోయిన్ గా టాప్ లో ఉన్న సమయంలోనే రాజేంద్రప్రసాద్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. అయితే అతడితో మనస్పర్థలు రావడంతో విడిపోయింది. తర్వాత నితిన్ కపూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా.. అతడు 2017లో అనారోగ్య కారణాలతో మరణించాడు. అయితే నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నాడని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి జయసుధ లేటు వయసులో మూడో పెళ్లి చేసుకుందా అనే చర్చ ఇండస్ట్రీ జనాల మధ్య సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -