Nose: ముక్కులో వేలు పెట్టే అలవాటు మార్చుకోకుంటే ఆ వ్యాధులన్నీ సోకుతాయట!

Nose: కొందరికి ఉండే అలవాట్లు పక్కన ఉన్న వారికి చిరాకు, కోపం తెప్పిస్తాయి. ఎంతమందిలో కూర్చున్న సరే వారికుండే అలవాట్లను మాత్రం మార్చుకోరు. అందిరితో కలిసి కూర్చునప్పుడు కాలు ఊపడం, చేతి వేళ్లు విరవడం తల గోక్కోవడం చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లతో అంతగా ఇబ్బంది కలగకున్నా మరికొంరికున్న అలవాట్లు కోపం వస్తోంది. ఎంత మందిలో ఉన్నా కూడా కొందరు ముక్కులో వేలు పెట్టుకుంటుంటారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ అలవాటును మార్చుకోరు. ఇలా ముక్కులో వేలు పెట్టుకోవడం ఇతరులను ఇబ్బంది కలిగించినా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ ముక్కులో వేలు పెట్టుకోవడంతో మెదడులోని నరాలు కుంచించుకుపోయి బలహీనపడుతుంది. అంతేకాక ఈ అలవాటు అల్జీమర్స్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు.

 

క్లామిడియా న్యూమోనియా అని పిలిచే బ్యాక్టీరియా అల్జీమర్స్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది. ఇది ముక్కు నుంచి ఘ్రాణ నాడి ద్వారా మన నాడీ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. ఈ తర్వాత మెదడు వ్యాధులకు కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా, వైరస్‌ వల్ల అమిలాయిడ్‌ బీటా ప్రోటీన్‌ మెదడులో ఉత్పత్తి అవుతుంది. ఇది చిత్తవైకల్యం, అల్జీమర్‌ వ్యాధికి కారణమవుతుంది.
ఈ వ్యాధి సోకితే మతిమరుపు కూడా వస్తోంది. చెప్పిన విషయాలను మర్చిపోవడం మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. అంతేకాక కొత్త విషయాలు నేర్చుకోవడంలో చాలా ఇబ్బందులు తలెత్తుయి. సరిగ్గా నిద్ర రాక మెదడు బరువుగా మారినట్లు అనిపిస్తోంది.

 

ముక్కులో ఘ్రాణ నాడి ఉంటుంది. ఇది నేరుగా మన మెదడుతో అనుసంధానించబడి ఉంటుంది. ముక్కులో వేలు పెట్టినప్పుడు, ఈ ఘ్రాణ నాడి ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌ లు నేరుగా మెదడులోని కణాలకు చేరుతాయి. దీంతో మెదడు వ్యాధులు వస్తాయి. చిత్తవైకల్యం నాడీకి సంబంధించిన ఒక రుగ్మత. దీనిలో మెదడు నరాలు కుంచించుకుపోవడం ప్రారంభమవుతాయి. దీనిలో కణాలు నాశనం అవుతుంటాయి. దీనివల్ల మెదడు కణాలు చురుగ్గా ఉండవు. చిత్తవైకల్యం వల్ల మెదడు హిప్పోకాంపస్‌ భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఇది విషయాలను గుర్తించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ చిత్తవైకల్యం వల్ల జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. ఈ అలవాటు నుంచి బయట పడాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. పొగతాగే వారుంటే ఆ అలవాటును వదిలేయాలి. మెదడు చురుకుదనం పనిచేసేలా అందుకు తగ్గ క్రీడలు (చెస్, మ్యాథమెటిక్స్‌)కు సంబం«ధించినవి ఆడాలి. ఆకుకూరలు, పల్లి గింజలు లాంటివి తరచుగా తింటే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -