Unseen Video: 22 ఏళ్ల క్రితం రామ్‌చరణ్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!!

Unseen Video: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా తెరగేంట్రం చేసిన రామ్ చరణ్.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీలలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న చెర్రీ.. ఇప్పుడు ‘మెగా పవర్ స్టార్’ గా వెలుగొందుతున్నాడు. అయితే తాజాగా చరణ్‌కు సంబంధించిన ఓ వీడియో అభిమానులను సర్ ప్రైజ్ చేయడమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా ‘చిరుత’ చిత్రంతో రామ్ చరణ్ హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ, మెగా వారసుడు హీరోగా డెబ్యూ కోసం ఎంతో కృషి చేసాడు. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకోవడమే కాదు.. నటనలో శిక్షణ కోసం యాక్టింగ్ స్కూల్ కు వెళ్లాడని చాలా మందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం.

ఒకే ఇనిస్టిట్యూట్‌లో చెర్రీ, శ్రియ శిక్షణ
యాక్టింగ్ స్కూలులో రామ్ చరణ్ తన స్కిల్స్ డెవలప్ చేసుకోవడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇందులో చెర్రీతో పాటుగా గార్జియస్ బ్యూటీ శ్రీయా సరన్ కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఏదో థీమ్‌కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. దీన్ని బట్టి సినిమాల్లోకి రాకముందు నుంచే చెర్రీ – శ్రియా ఇద్దరికీ పరిచయం ఉందని.. ఒకే ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది.

ఇకపోతే 2001లో ‘ఇష్టం’ మూవీతో శ్రియా శరన్ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయింది. స్టార్ హీరోల పక్కన అవకాశాలు అందుకోవడమే కాదు.. వరుస విజయాలతో రెండు దశాబ్దాలు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అలానే 2007లో ‘చిరుత’ చిత్రంతో బిగ్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. ఇక చిరంజీవికి జోడీగా నటించిన శ్రియా.. RRR సినిమాలో చరణ్‌కు తల్లిగా కనిపించిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -