Pawan-Roja: కేసీఆర్ గురించి మాట్లాడితే మక్కెలిరగ్గొడతారు.. పవన్ పై రోజా కామెంట్స్ విన్నారా?

Pawan-Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ లోని వాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. దీంతో పవన్ కళ్యాణ్ ని శిక్షించాలని ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇటు వైసిపి నేతలు వాలంటీర్లు వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా. ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజా పవన్ పై నిప్పులు చెరిగారు ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు తనకు నచ్లేదని,వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని పవన్, చంద్రబాబులకు అర్థమైందని, వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావడం జీర్ణించుకోలేకే పవన్ అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు.

 

మహిళలన్నా, వాలంటీర్లన్నా పవన్ కు గౌరవం లేదని, సీఎం జగన్ ను కూడా చులకన చేసి మాట్లాడుతున్నారన్నారని విమర్శలు గుప్పించారు. జగన్ ను చూసి వణుకుతున్న పవన్, చంద్రబాబులు తాజాగా వాలంటీర్లను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ విషం చిమ్ముతున్నారని, ఆ వ్యాఖ్యలకు గాను వాలంటీర్ల కాళ్లు పట్టుకొని పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్ల అక్రమ రవాణా కోసం వాలంటీర్లు ఉద్యోగం చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఉమెన్ ట్రాఫికింగ్ టాప్ 10లో ఏపీ లేదని, తెలంగాణ ఆరో స్థానంలో ఉందని, అక్కడకు వెళ్లి కేసీఆర్ ను ప్రశ్నించగలవా? పవన్ అని ప్రశ్నించారు. కేసీఆర్ గురించి మాట్లాడితే మక్కెలిరగ్గొడతారని, హైదరాబాద్ లో బతకలేరు కాబట్టే అక్కడ మాట్లాడవని మండిపడ్డారు. వాలంటీర్లపై ఆ వ్యాఖ్యలు చేశావని, నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా? అని ప్రశ్నించారు రోజా. నీ తల్లి చాలా గొప్పది. అలా అనకూడదు. కానీ నీ కారణంగా అందరూ ఆమెను అనే పరిస్థితి వచ్చింది. నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా అని వ్యాఖ్యానించినందుకు అమ్మా.. నన్ను క్షమించమ్మా అంటూ రోజా క్షమాపన తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -