Jayalalitha: ఆస్పత్రిలో కేకలు పెట్టిన జయలలిత.. అసలేం జరిగింది?

Jayalalitha: తమిళనాట జయలలిత అంటే ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహనీయురాలు. నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును చాటుకున్నారు. తమిళులకు అమ్మగా సుపరిచితురాలు. ఆమెపై ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా సమర్థవంతంగా ఎదుర్కొనే వారు. తమిళనాడును ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు. అలాంటి మహనీయురాలు చివరి రోజులు ఆస్పత్రిలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడిపారు. ఎన్నో ఇబ్బందులు, బాధాకర పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తాజాగా ఆరుముగస్వామి కమిషన్ నివేదికతో వెల్లడించింది. ఈ నివేదికలో సంచలన నిజాలను బయటపెట్టింది. తమిళనాడులో జయలలితకు పార్టీ పరంగా, వ్యక్తత్వం పరంగా ఎంతో గౌరవం లభించేది.

ఆమె సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో సంచనలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ చివరి రోజుల్లో ఆమె మరణం ఒక మిస్టరీగా మారింది. ఆమె ఎలా మరణించిందనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలా మంది సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఆరుముగస్వామి కమిటీని నియమించింది. ఈ కమిషన్ జయలలిత ఆస్పత్రికి ఎలాంటి పరిస్థితిలో జాయిన్ అయింది. ఆమె పడిన బాధలపై వివరణ ఇచ్చారు. ఓ కార్యక్రమానికి హాజరైన జయలలితకు కళ్లు కింద పడింది. దీంతో 2016 సెప్టెంబర్ 22న ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆమెకు అనేక ఆరోగ్య సమస్యలు రావడంతో వల్ల వైద్యులు స్టెరాయిడ్స్ ఇచ్చి కంట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆమె మెల్లమెల్లగా కోలుకోవడం మొదలు పెట్టింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె.. అక్టోబర్ 19న మాట్లాడే స్థితికి వచ్చింది. కండరాల బలహీనత వల్ల మరికొద్ది రోజులపాటు చికిత్స కొనసాగించాలని వైద్యులు చెప్పారు.

దీంతో జయలలితకు అనేక ఆరోగ్య చికిత్సలు చేశారు. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుండటంతో ఆమెకు బాగా విసుగు పుట్టిందని, ఈ చికిత్సలను తట్టుకోలేకపోతున్నట్లు నివేదిక వెల్లడైంది. అప్పుడు జయలలిత ఇంటికి వెళ్తానని, తనను ఇంటికి పంపించమని బాధపడినట్లు పేర్కొన్నారు. అయితే ఆమెను వెంటిలేటర్‌పై ఉంచేందుకు వైద్యులు ఎంతగానో ప్రయత్నించారు. రెండున్నర నెలలపాటు జయలలిత ఆస్పత్రిలోనే గడిపారు. ఆ సమయంలో భక్తి పాటలు వినేవారని, ఆస్పత్రి గదిలో దేవుళ్ల చిత్ర పటాలను చూస్తే ప్రార్థించేవారని కమిషన్ పేర్కొంది. కాగా, 2019 డిసెంబర్ 5న ఆమె తుది శ్వాస విడిచి స్వర్గీయులయ్యారని కమిషన్ వెల్లడించింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -