Samantha: సమంతకు దగ్గరగా కూర్చోవాలంటే అన్ని రూ.లక్షలు చెల్లించాలా.. ఇలా కూడా డబ్బులు సంపాదిస్తారా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంతా ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సమంత సినిమాల విషయానికి వస్తే.. యశోద, శాకుంతలం తర్వాత సమంత తాజాగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. కాగా సామ్ ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత వైద్య చికిత్స కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సమంత వెళ్లింది ట్రీట్ మెంట్ కోసమే కాదట. ఈనెల 20న అక్కడ నిర్వహించిన ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో పాల్గొనడానికీ ఆమె అక్కడికి వెళ్లిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే పనిలో పనిగా సమంత అక్కడ తన ఖుషి సినిమా ప్రమోషన్స్‌ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే సమంత తాజాగా అక్కడ జరిగిన ఒక ఈవెంట్‌లో కూడా పాల్గోంది. అయితే ఆ ఈవెంట్‌లో సమంత పాల్గొన్నందకు ఆమెకు అక్షరాల రూ.30 లక్షలు చెల్లించారట నిర్వాహకులు.

 

అంతేకాదు ఈ ఈవెంట్‌లో పాల్గోనే వారికి నిర్వాహకులు టికెట్ల ధర రూ.12 వేల నుంచి రూ.2 లక్షల వరకు నిర్ణయించారట. అయితే 2 లక్షల రూపాయల టికెట్‌ కొనుగోలు చేసినవారికి సమంతకు దగ్గరగా కూర్చునే అవకాశం ఉంటుందట. దీనికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తన మయోసైటీస్ వ్యాధిని నయం చేసుకోవడానికి అక్కడే ఆమె ఒక మూడు నెలలపాటు ఉంటున్నట్లు తెలుస్తోంది. యశోద సినిమా సమయంలో ఆమె తనకు ఉన్న మయోసైటీస్ గురించి తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. గత కొన్ని రోజులుగా మయోసైటీస్‌తో బాధపడుతున్నానని తెలిపింది.

 

అయితే దీనికి తగిన చికిత్స తీసుకుంటున్నట్లు కూడా పేర్కోంది. ఇకఅందులో భాగంగానే ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లింది. ఇక ఈ మయోసైటీస్ చికిత్స ఖర్చు మాత్రం 25 కోట్లు ఉంటుందని, ఈక్రమంలో ఆమె ఒక హీరో దగ్గర కొంత అప్పుగా కొంత డబ్బు తీసుకుందని ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో సమంత స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రాస్తూ.. అదంతా ఫేక్ అని నా చికిత్సకు అంత ఖర్చు కాదు. నేను సినిమాల్లో నటించి బాగానే సంపాదించాను. నాకు ఎవరి అవసరం లేదంటూ ఘాటుగా స్పందించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -