Varsha: వర్ష క్యారెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇమ్మాన్యుయేల్!

Varsha: జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కడుపుబ్బా నవ్వుకోవాలంటే జబర్దస్త్ షో చూడాల్సిందే. మరి ఈ షోలోని సెలబ్రిటీలు తమపై తామే పంచ్ లు వేసుకుంటూ, ఒకరిపై మరొకరు కుళ్లు జోకులు పేల్చుతూ అందర్నీ నవ్వించే ప్రయత్నం చేస్తుంటారు. అందులో తాజాగా వర్ష అమ్మాయి కాదంటూ ఇమ్మానియేల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

సుధీర్, రష్మీ జంట తర్వాత జబర్దస్త్ లో పాపులర్ అయిన జంటల్లో వర్ష, ఇమ్మానియేల్ నిలిచారు. బుల్లితెరపై వీరు ప్రేమ జంటగా మారారు. మరో షోలో వీరికి పెళ్లి కూడా చేశారు. వర్ష ఈ షోలోకి రాకముందు సీరియల్ లో నటిస్తూ ఉండేది. రెండేళ్ల క్రితం జబర్దస్త్ కి వచ్చి లేడీ కమెడియన్ గా వర్షం అవతారం ఎత్తింది.

 

వర్ష లేడీ గెటప్ చూసి కొందరు అబ్బాయంటూ కామెంట్స్ చేస్తుండగా అది కూతా స్కిట్ లో భాగమేనని అంటున్నారు. అయితే వర్ష ఇమ్మానియేల్ తో లవ్ లో ఉందని మరికొందరు వీరి జంటపై పెదవి విరుస్తున్నారు. మొత్తానికి బుల్లితెరపై వీరి లవ్ ట్రాక్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇమ్మానియేల్ తనకు దేవుడు ఇచ్చిన వరం అని వర్షం చెబుతూ వస్తుండగా ఇమ్మానియేల్ మాత్రం ఆమెపై కుళ్లు జోకులు పేల్చుతున్నాడు. ఈ మధ్యనే బుల్లితెర వేదికగా ఇమ్మానియేల్ వర్ష మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. దీంతో అందరూ వీరి జంటను నిజమైన దంపతులు అంటూ ఆశీర్వదించారు.

 

ఈ జంట అప్పుడప్పుడు వాదించుకోవడం కామన్ అయిపోయింది. జబర్దస్త్ షోలో వర్షను లేడీ గెటప్ అంటూ ఇమ్మానియేట్ ఏడిపిస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో వర్ష కూడా చాలా కోపంగా ఉంది. పదే పదే తనను లేడీ గెటప్ అంటే ఊరుకోనని ఫైర్ అయ్యింది. వర్షను లేడీ గెటప్ అంటూ మరోసారి ఇమ్మానియేల్ ఎక్ట్సా జబర్దస్త్ లో కామెంట్స్ చేశాడు. దీంతో వర్ష మరోసారి సీరియస్ అయ్యింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో వర్ష ఇమ్మానియేల్ పై కోపంతో రలిగిపోకుండా తనను కామెంట్ చేస్తున్నారనే బాధతో కుమిలిపోయింది. దీనిపై నెటిజన్లు కూడా విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -