Jabardasth Varsha: ఆ సమయంలో చనిపోవాలని అనుకున్న జబర్దస్త్ వర్ష.. ఏం జరిగిందంటే?

Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వర్ష ప్రస్తుతం పలు సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మామూలుగా లేదని చెప్పాలి. ఈ విధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా వర్ష మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

తాను త్వరలోనే ఓ పెద్ద కార్యక్రమంలో పాల్గొనబోతున్నానని అక్కడ తన విషయాలు మొత్తం చెబుతానని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే తనకు చెక్కు కూడా పంపించారని చెప్పడంతో బహుశా ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి రాబోతుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ విషయం కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన గురించి కూడా తెలిపారు.

 

తనకు తన చిన్నన్నయ్య అంటే చాలా ఇష్టం అయితే రెండు సంవత్సరాల క్రితం సంక్రాంతి సమయంలో తాను ఊరికి వెళ్ళగా అమ్మ ఫోన్ చేసి అన్నయ్యకు యాక్సిడెంట్ అయిందని తెలిపారు. స్కూటీతో గుద్దారు అంటే చిన్న ప్రమాదమే అనుకున్నాను కానీ వచ్చాక చూస్తే మాత్రం ఆయన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని తెలిపారు రెండు రోజులు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేనని డాక్టర్స్ తెలిపారు.

 

ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి అన్నయ్యను బయట పడేయమని డాక్టర్ల కాళ్లు పట్టుకొని బ్రతిమాలను. అన్నయ్య పరిస్థితి గురించి నాకు మాత్రమే తెలుసు ఇంట్లో వారికి తెలిస్తే వాళ్లు కంగారు పడతారని రెండు రోజులపాటు ఆ బాధను నేనే భరించాను వాష్ రూమ్ బయట పడుకున్నాను, ఎలాగైనా అన్నయ్యను బ్రతికించాలని డాక్టర్లు కాళ్లు పట్టుకున్నాను. అన్నయ్య గురించి ఆలోచిస్తూ నేను కూడా అనారోగ్యానికి గురయ్యానని డాక్టర్లు నాకి కూడా ట్రీట్మెంట్ చేశారని తెలిపారు. అయితే రెండు రోజుల తర్వాత అన్నయ్యకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిసి కుదట పడ్డానని ఈ సందర్భంగా వర్ష చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -