Vinayaka Chavithi: వినాయక చవితి రోజూ పాలవెల్లిని ఎందుకు కడతారో తెలుసా?

Vinayaka Chavithi: ప్రతి శుభకార్యానికి భక్తిశ్రద్ధలతో మొదటగా పూజించే దేవుడు గణేషుడు. ఎటువంటి శుభకార్యం తలపెట్టిన ఆటంకాలు లేకుండా సజాగా సాగిపోవాలి అని ఆ గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే సాధారణ పూజా కార్యక్రమాలలో భక్తితో గణేశుని పూజిస్తూ ఉంటారు. ఇక వినాయక చవితి రోజున అయితే ఆ గణనాధుని మరింత భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో పూజిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని ఆ గణనాథానికి ఇష్టమైన ఎన్నో రకాల పిండి వంటలను, పళ్ళు పలహారాలను కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ గణనాధునికి వినాయక చవితి పండుగ సందర్భంగా భారీగా పందిరి లు వేసి ఘనంగా పది రోజులపాటు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

అయితే ఈ వినాయక చవితి రోజున వినాయకుడికి పాలవెల్లి కడుతూ ఉంటారు. అయితే ఇది ఎందుకు కడతారు అన్నదానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ సృష్టిని శాసించే మహాశక్తిమంతుడు ఆ గణనాథుడు. అయితే అంతటి శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. పూజా సమయంలో పైన పాలవెల్లి కట్టి దానికింద వినాయక విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేస్తారు. అనంతరం భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. గణాలకు అధిపతి అయిన గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే.

ఆ ముక్కోటి దేవతలందరికీ సూచనగా ఈ పాలవెల్లిని కడతారు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా కూడా భావించవచ్చు. అలాగే పాలవెల్లి అంటే పాలపుంతే అని చెప్పవచ్చు. మరి అందులో నక్షత్రాలు ఏవి! అంటే అందుకోసమే అందులో వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ లాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళవస్తువులకు సూచన అన్నమాట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -