Home Loan: గృహరుణం తీసుకుంటున్నారా.. అయితే వీటిని ఫాలో అవ్వండి

Home Loan: ప్రతి ఒక్కరూ సొంతిటి కళను నెరవేర్చాలనుకుంటారు. ఆ కళను నిజం చేయాలంటే ∙హోమ్‌లోన్‌ తీసుకోవడం మాములైంది. ఎవరైతూ సొంతిళ్లు కోరుకుంటారో తిరిగి చెల్లించే శక్తి ఉంటేనే హోమ్‌లోన్‌ గురించి ఆలోచించాలి. కొన్ని ప్రాంతాల్లో ఇంటిని నిర్మించుకునే వారి ఖర్చు వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. దాని కన్నా ముందే హోమ్‌లోన్‌కు సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే మంచిది.

ఖాతాదారులకే ప్రాధాన్యం..

చాలా బ్యాంకులు ప్రస్తుతమున్న వారి ఖాతాదార్లకు వడ్డీ రేట్లలో ప్రాధాన్యం ఇస్తాయి. ఇతర నిబంధనలు, షరతులు సరళంగా ఉండేలా చూస్తాయి. కానుక దరఖాస్తుదారులు ఇప్పటికే డిపాజిట్లు లేదా రుణ సంబంధాలను కలిగి ఉన్న బ్యాంకులను సంప్రదించాలి.

డౌన్‌ పేమెంట్‌..

బ్యాంకుల వద్ద హోమ్‌లోన్‌ తీసుకునేటప్పుడు డౌన్‌పేమెంటు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా చెల్లించినవారికి లోన్‌ మంజూరు వేగంగా జరుగుతుంది. దరఖాస్తుదారులు మొత్తం గృహ రుణ విలువలో 10– 25% వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి అధిక డౌన్‌ పేమెంట్‌ క్రెడిట్‌ రిస్క్‌ ని తగ్గిస్తుంది. రుణ మంజూరు అవకాశాలు మెరుగవుతాయి. కొన్ని బ్యాంకులు తక్కువ రుణ విలువ ఎంచుకునే వారికి తక్కువ వడ్డీ రేటుతో లోన్‌ ఇస్తారు.

క్రెడిట్‌ స్కోరు..

హోమ్‌లోన్‌ అప్లికేషన్‌ పరిశీలించేటప్పుడు బ్యాంకులు,హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు పరిగణించే అంశాలలో మీ క్రెడిట్‌ స్కోరు, 750 లేదా అంతకన్నా ఎక్కువ క్రెడిట్‌ స్కోరుని ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే లోన్‌ పొందాలనుకునేవారు క్రమం తప్పకుండా తమ క్రెడిట్‌ స్కోరును సమీక్షించాలి.దీంతో తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్న వారు తమ క్రెడిట్‌ స్కోరును పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఈఎంఐల స్తోమత పరిగణలోకి..

దరఖాస్తులను పరిశీలిస్తున్నప్పుడు రుణం తీసుకునేవారి తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. రుణ దరఖాస్తుదారులు నెల సంపాదనలో ప్రస్తుత రుణం సహా మొత్తం అన్ని ఈఎంఐలు కలిపి 50–60% లోపు ఉండేవారికి రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. అందుకే ఈఎంఐలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న దరఖాస్తుదారులు ముందు తీసుకున్న రుణాలలో కొన్నింటిని తీర్చేయడం లేదా ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవడానికి పాత రుణాలను ఎక్కువ కాలం తిరిగి చెల్లించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

వేరే బ్యాంకులతో పోల్చుకోవాలి..

వడ్డీ రేట్లు, రుణ మొత్తం, రుణ విలువ నిష్పత్తి,రుణ కాల పరిమితి, ప్రాసెసింగ్‌ ఫీజులు,గృహ రుణాల ఇతర అనుబంధ వ్యయాల్లో బ్యాంకుల మధ్య చాలా తేడా ఉంటుంది. రుణాలు ఎక్కువ విలువ, కాల వ్యవధిని కలిగి ఉంటాయి. కాబట్టి, బ్యాంకుల మధ్యలో ఉండే వడ్డీ రేట్లలో చిన్న వ్యత్యాసం కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. అందుకే దరఖాస్తుదారులు వీలైనన్ని బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు అందించే హోమ్‌ లోన్ల ఆఫర్లను క్షుణ్నంగా పరిశీలించాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -