Assembly Polls: బీజేపీ కోసం టీడీపీ, జనసేన త్యాగాలు అవసరమా.. పొత్తు లేకపోతే పార్టీకి మేలంటూ?

Assembly Polls: వైసీపీ వరుసగా అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ ఉంటే.. టీడీపీ, జనసేన మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే.. ఆ రెండు పార్టీలు ఇంకా మీనమేషాలు లెక్కబెడుతున్నాయి. చంద్రబాబు, పవన్ కు అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీ ఉంది. ఇప్పటికే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు, ఏ ఏ స్థానాలు కేటాయించాలనే దానిపై ఆ రెండు పార్టీలకు ఓ స్పష్టత వచ్చింది. కానీ, బీజేపీ కూడా పొత్తులో భాగం అవుతుందనే వార్తల నేపథ్యంలో ఇంకా ఆ రెండు పార్టీలు సీట్ల ప్రకటనను వాయిదా వేసుకుంటున్నాయి.

ఇప్పుడు బీజేపీ కాకమ్మ కోరికలు కోరుతుంది. 5 నుంచి 6 ఆరు ఎంపీ స్థానాలు, 13 ఎమ్మెల్యే స్థానాలను చంద్రబాబుతో భేటీలో అమిత్ షా కోరినట్టు తెలుస్తోంది. కానీ, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం 20కి తగ్గకుండా ఎమ్మెల్యే స్థానాలు డిమాండ్ చేయడాని కేంద్ర నాయకత్వానికి సూచిస్తోంది. కనీసం 15 స్థానాలైనా ఇవ్వకపోతే పొత్త అవసరం లేదని రాష్ట్ర బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సింగిల్ లేదా జనసేనతో కలిసి పోటీ చేస్తే కనీసం 20 స్థానాలైనా గెలుస్తామని చెబుతున్నారట. అమిత్ షా అడిగిన స్థానాలే బీజేపీ ఇవ్వడం ఎక్కువ. అంతకు మించి రాష్ట్ర నాయకత్వం అడుగుతోంది. గెలుస్తుందంనుకుంటే ఎన్ని స్థానాలు ఇచ్చినా తప్పులేదు. కానీ, బీజేపీకి ఎన్ని స్థానాలు ఇచ్చినా ఆ స్థానాల్లో ఓటమి ఖాయం. ఎందుకంటే ఏపీలో బీజేపీపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. బీజేపీ ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేసిందనే కోపం ప్రజల్లో పాతుకుపోయింది. అందుకే, అసలు బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు సైతం అంగీకరించలేకపోతున్నారు.

నిజానికి బీజేపీతో కలిసి వెళ్తే టీడీపీకి నష్టం జరుగుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే, జగన్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ అవసరం పడుతుందని చంద్రబాబు, పవన్ పొత్తుకు పాకులాడుతున్నారు. బీజేపీ లేకపోయినా.. ఈసారి ఏపీలో టీడీపీ, జనసేన కూటమి గెలుపు ఖాయంగానే ఉంది. వైసీపీపై ఆ స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తుంది. ఇండియా టుడే సర్వే ఫలితాలే దాదాపుగా అంతిమ ఫలితాలు అయ్యే అవకాశం ఉంది. అందుకే మొదట్లో టీడీపీతో పొత్తుపై ఉలుకూ పలుకూ లేనట్టు ఉండే బీజేపీ పెద్దలు సడెన్‌గా చంద్రబాబును పిలిపించుకోవడానికి కూడా కారణం అదే.

టీడీపీ, జనసేన కూటమి గెలుస్తుందనే నమ్మకంతోనే తెలుగుదేశాన్ని ఎన్డీఏలో చేర్చుకోవడానికి అమిత్ షా సుముఖంగా ఉన్నారు. గెలిచే పరిస్తితిలో అసలు బీజేపీతో జత కట్టడం ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనసరంగా టీడీపీ, జనసేన సీట్లు త్యాగం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఈ రెండు పార్టీ సీట్లు త్యాగం చేసినా.. బీజేపీ గెలుస్తుందా? అంటే అదీ లేదు. ఆ మాత్రం దానికి పొత్తు లేకుండా వెళ్లడమే మంచిదనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -