Jagan: జగన్ ఐదేళ్ల పాలనలో బూతులు తప్ప ఇంకేం లేవుగా.. ఏమైందంటే?

Jagan: బూతు రాజకీయానికి అడ్డాగా ఏపీ మారిపోయింది. అలా అని ఏ ఒక్కరికో ఇది పరిమితం కాలేదు. అన్ని పార్టీలు కొచ్చెం ఎక్కువ తక్కువలో ఈ సంస్కృతిని అలావాటు చేసుకున్నాయి. అయితే, దీనికి బీజం వేసింది మాత్రం వైసీపీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కాస్త నోరు జారుతూ ఉంటారు కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే తరహా రాజకీయాన్ని కంటిన్యూ చేస్తోంది. నిజానికి వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత బూతులకు పదును పెట్టారు. పవర్ లో ఉన్నపుడు కాస్త బాధ్యతగా వ్యవహరించాలనే ఆలోచన కొంచెం కూడా కనిపించడం లేదు. దీని ప్రభావం వైసీపీని ఫాలో అయ్యే సామాన్య జనంపై, యువతపై కూడా పడుతోంది. విపక్షాలకు ఓ బూతుతో సమాధానం చెప్పడం ఓ ఫ్యాషన్ గా కూడా మారిపోయింది.

 

ఈ సంస్కృతిని సీఎం జగనే పెంచి పోషిస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించడంలోనో.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలోనో జగన్ సంతోషాన్ని వెతుక్కునే రకంలా కనిపించడం లేదు. ప్రత్యర్థులను తిడితే ఆయనకు సంతోషంగా అనిపిస్తుందేమో కానీ.. సొంత పార్టీనేతలు చంద్రబాబు, పవన్, లోకేష్‌ను తిడితే ఆయన కళ్లలో ఆనందానికి అంతే ఉండదు. ఎంత దారుణంగా తయారైంది అంటే.. లిక్కర్ షాప్ ముందు మందుబాబులు తిట్టుకునే దాని కంటే.. దరిద్రంగా అమ్మ, అక్క అని తిట్టుకోవడం ఏపీ రాజకీయల్లోనే చూడొచ్చు. కనీసం మనం కొన్ని లక్షల మందికి ప్రతినిధులం.. వారి కలల సాకరం కోసం అసెంబ్లీలో అడుగు పెడుతున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు.

విపక్ష నేతలను తిట్టించడం ఓ ఎత్తైతే.. తిట్టిన వారికే అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లు అనే సాంప్రదాయం మరీ దారుణంగా మారిది. ఇటీవల వైసీపీని వీడి బయటకు వస్తున్నవారు చెబుతున్న మాటలు ఇవి. వైసీపీలో టికెట్లు పొందడానికి బూతులు మాట్లాడటమే అర్హతగా మారిపోయిందని ఆ పార్టీనేతలే చెబుతున్నారు. బాగా పని చేసిన వారికో.. గడపగడపకు కార్యక్రమాన్ని గొప్ప నిర్వహించిన వారికో వైసీపీలో టికెట్లు వస్తాయని ఖచ్చితంగా వస్తాయని చెప్పే పరిస్థితి ఆ పార్టీలో లేదు. బూతులు తిడితేనే టికెట్. అందులోనూ తిట్టడంలో ఎంత ఎక్కువ క్రియేటివిటీ చూపిస్తే వారు జగన్‌కు మరింత సన్నిహితులుగా మారుతారట. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను తిట్టలేదు కనుక ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కానీ, జోగి రమేష్ సంగతి తెలిసిందే కదా.. అందుకే ఆయన ఓ శాఖమంత్రి అయ్యారు.

 

మనకు నోరుంటే అవతలి వారికి నోరుండదా? మనం నాలుగు తిడితే అవతలి వారు రెండు అయినా తిట్టరా? ఒక చెంప మీద కొడితే.. మరో చెంప చూపడానికి ఇక్కడ ఎవరూ గాంధీలు లేరు. వైసీపీ నేతలుకు ఉన్నంత బూతుల క్రియేటివిటీ లేకపోయినా.. ప్రత్యర్థులు కూడా ఎంతో కొంత తిడతారు కదా.. కాబట్టి, విపక్షాలు కూడా జగన్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తిట్టిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో దూషణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. జగన్ భార్యను, కుమార్తెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వన్నీ పట్టవో ఏమో మరి తెలియదు కానీ.. పెద్దగా వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి విషయాలను చాలా లైట్ తీసుకున్నట్టే కనిపించారు. అధికారం కోసం తల్లి, చెల్లి, చిన్నాన్ననే కాదున్న జగన్.. భార్య, కుమార్తెను ఎవరో తిడితే పట్టించుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -